వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది మంత్రులు శాసనసభ్యులుగా బుధవారం ప్రమాణం చేశారు. అంజాద్ బాషా, ఆళ్ల నాని, పాముల పుష్ప శ్రీవాణి, కె.నారాయణస్వామి, అనిల్‌కుమార్ యాదవ్, గౌతంరెడ్డి, గుమ్మనూరు జయరాం, కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి, శంకరనారాయణ, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, తావేటి వనిత, పేర్ని నాని, పినిపె విశ్వరూప్ తదితరులు ప్రమాణం చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ శంబంగి చిన అప్పలనాయుడు ప్రమాణం చేయించారు.
23 మంది ఏపీ మంత్రులు