బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జున - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జున

హైద్రాబాద్, జూన్ 29, (way2newstv.com)

బిగ్ బాస్ 3 సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్‌లుగా ఎవరు పాల్గొంటున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్ హోస్ట్‌ ఎవరనే విషయం రకరకాల ప్రచారాలు జరిగాయి. ఫస్ట్ సీజన్లో హోస్ట్‌గా అదరగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాతి సీజన్‌కు దూరమయ్యారు. దీంతో రెండో సీజన్లో నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరించారు. ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ.. తర్వాత ఆయన కూడా తనదైన శైలిలో షోను నడిపించారు. ఈసారి నాని స్థానంలో కొత్త హోస్ట్ ఎవరనే విషయమై తీవ్ర ప్రచారం జరిగింది. 

బిగ్ బాస్ 3 హోస్ట్ గా నాగార్జున

హోస్ట్ విషయమై మా టీవీ అఫీషియల్‌గా ప్రకటన చేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు షోను విజయవంతంగా నడిపిన నాగార్జున ఈ సీజన్లో హోస్ట్‌గా వ్యవహరిస్తారని మా టీవీ ట్వీట్ చేసింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ల కోసం వంద రోజులకు సరిపడా కూరగాయలు, కోడి గుడ్లు కొనుగోలు చేయడం కోసం మార్కెట్‌కి వెళ్లినట్టుగా నాగార్జునతో ప్రొమో రూపొందించి వదిలింది. ఈసారి నేను రంగంలోకి నేను దిగుతున్నానంటూ.. నాగ్ బిగ్ బాస్ ప్రారంభానికి ముందే ప్రోమోతో ఆకట్టుకున్నారు. జూలై 21 నుంచి బిగ్ బాస్ 3 ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. వంద రోజులపాటు నడిచే ఈ షోలో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొనున్నారు. వారాంతాల్లో హోస్ట్‌గా నాగార్జున అపియరెన్స్‌తో మహిళా ప్రేక్షకులు మరింతగా ఈ షోకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.