బుధవారం నుంచి రాజన్న బడి బాట


అమరావతి జూన్ 8, (way2newstv.com
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడంపై  దృష్టి సారిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... దాని కోసం బుధవారం నుండి  ' రాజన్న బడి బాట ' కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మంగళవారం తో బడులకు  వేసవి సెలవులు ముగిసాయి.  


బుధవారం నుంచి రాజన్న బడి బాట
బుధవారం నుంఇ  చిన్నారులు తిరిగి స్కూళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో  ఈ నెల 12 వ తేదీ నుండి 15 వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాజన్న బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం  నిర్ణయించింది.  తొలి రోజు కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలుకుతూ అన్ని స్కూళ్లలో సంబరాలు నిర్వహించాలని, పాఠశాలలను సంప్రదాయబద్ధంగా అందంగా అలంకరించి జాతీయ గీతాలాపన తో బడి బాట ప్రారంభించాలని, మూడు రోజులు వివిధ కార్యక్రమాలతో సంబరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Previous Post Next Post