సచివాలయానికి భూమి పూజ చేసిన కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సచివాలయానికి భూమి పూజ చేసిన కేసీఆర్


హైదరాబాద్, జూన్ 27, (way2newstv.com)
నూతన సచివాలయమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం భూమి పూజ చేసారు. ప్రస్తుతం ఉన్న సెక్రటేరియట్ భవనం స్థానంలోనే రూ.400 కోట్ల వ్యయంతో కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సచివాలయం డి-బ్లాక్ వెనుక భాగంలోని తోటలో కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు. 


సచివాలయానికి భూమి పూజ చేసిన కేసీఆర్

ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కొబ్బ‌రికాయ‌లు కొట్టారు. మంత్రులు మెహ‌మూద్ అలీ, జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, ఈటెల రాజేంద‌ర్‌, త‌లసాని శ్రీనివాస్, ఇంద్ర క‌ర‌ణ్ రెడ్డి, స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కేశ‌వ‌రావు, మండ‌లి డిప్యూటీ చైర్మ‌న్‌ విద్యాసాగ‌ర్ రావు, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు హ‌రీశ్ రావు, బాల‌రాజు, జీవ‌న్‌రెడ్డి, రాజ‌య్య‌, ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ముందుగా కేసీఆర్ పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టారు. హారతి అనంతరం ఆత్మ ప్రదక్షిణ చేసి శంకుస్థాపన గోతిలో పూజాద్రవ్యాలు వేసి పనులకు శ్రీకారం చుట్టారు.  కార్యక్రమం తరువాత ఎర్రమంజిల్ లో నిర్మించ తలపెట్టిన నూతన అసెంబ్లీ భవనానికి శంకుస్థాపన చేసారు.