మళ్లీ చిరు- విజయశాంతి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మళ్లీ చిరు- విజయశాంతి


హైద్రాబాద్, జూన్ 28 (way2newstv.com)
మెగాస్టార్ చిరంజీవి – లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పటిలో ఒక క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్ లో సినిమా అంటే అప్పటిలో ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. అయితే ఆ తరువాత విజయశాంతి సినిమాలకు దూరం కావడంతో వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఇద్దరు పొలిటికల్ గా బిజీ అయ్యిపోయారు. అయితే చిరు పొలిటికల్ గా బిజీగా ఉంటూనే సినిమాలు చేయాలనీ డిసైడ్ అయ్యి సినిమాలు చేస్తున్నాడు. అలానే విజయ శాంతి కూడా సినిమాలు చేయాలనీ డిసైడ్ అయిందిఅలా అనుకుందో లేదో వెంటనే ఆమెకు మహేష్ తో నటించే ఛాన్స్ వచ్చింది. 

మళ్లీ చిరు- విజయశాంతి

‘సరిలేరు నీకెవ్వరు’తో విజయశాంతి రీఎంట్రీ ఇస్తోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా విజయశాంతి కొత్త ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. అంతే మన మేకర్స్ కి ఓ ఆలోచన వచ్చింది. చిరు – విజయ శాంతి కాంబినేషన్ లో ఓ సినిమా తీస్తే ఎలా ఉంటుందని పలువురికి బుద్ధి పుట్టింది. చిరు ఇంకా హీరోగా నటిస్తున్నారు కనుక వీరిద్దరూ కలిసి జంటగా కనిపించే అవకాశమయితే లేదు. కాకపోతే సమవుజ్జీలయిన పాత్రలని తీర్చిదిద్దితే ఆ సినిమా ఒక ఊపు ఊపేస్తోంది. త్వరలోనే వీరి కాంబినేషన్ లో మూవీ చూడొచ్చని అంటున్నారు. మరి చిరు నెక్స్ట్ కొరటాలతో ఓ సినిమా చేస్తున్నాడు. అందులో అది సాధ్యపడుతుందో లేక త్రివిక్రమ్‌ ఈ కలయికని తెరమీదకి తెస్తాడో తెలియదు. అలానే బాలకృష్ణ సినిమాలో కూడా విజయ శాంతి నటించే అవకాశముందని చెబుతున్నారు. చూద్దాం ఎవరి సెట్ అవుతుందో.