రాష్ట్ర, దేశాభివృద్ధికి సర్వ మతాలు కలిసి మెలసి ఉండాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రాష్ట్ర, దేశాభివృద్ధికి సర్వ మతాలు కలిసి మెలసి ఉండాలి


- రంజాన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ 
- రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు 
సిద్ధిపేట, జూన్ 05(way2newstv.com)
రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందాలంటే కుల మతాలకు అతీతంగా అన్నీ మతాలు, కులాల వారు కలిసి మెలసి ఉంటేనే రాష్ట్ర, దేశాభివృద్ధి చెందుతుందని రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. బుధవారం సిద్ధిపేటలో జ‌రిగిన‌ రంజాన్ పండుగ వేడుకల్లో జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ తో కలిసి హాజరయ్యారు. ముస్లింల పవిత్ర పండుగైన రంజాన్ పండుగ పురస్కరించుకుని ప్రజలకు, ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. దేశంలో నే రంజాన్‌ను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఏకైక ప్రభుత్వం, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని, రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌పున‌ లక్షలాది మంది పేద ముస్లింలకు రంజాన్ పండుగకు సరుకులు ,బట్టలు ఇచ్చామ‌ని తెలిపారు. సిద్ధిపేటలో 15ఏళ్లుగా ముస్లిం సోదరులను వ్యక్తిగతంగా కలిసి శుభాకాంక్షలు తెలుపడం ఆనవాయితీగా వస్తుందని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై హిందూ, ముస్లింలు కలసి ముందుకు వెళ్తున్నారని చెప్పారు. 


రాష్ట్ర, దేశాభివృద్ధికి సర్వ మతాలు కలిసి మెలసి ఉండాలి  
కుల, మతాలనేవి, కేవలం నమ్మకం కోసమేనని అభివృద్ధికి అడ్డుగా ఉండొద్దని, టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధ్యే ధ్యేయంగా పని చేస్తున్నదని తెలిపారు. మన తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతిని సాధించేలా.. సీఏం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధిలో దేశంలోనే నెంబరు వన్ గా నిలువాలని కోరారు. హిందువుల పండుగలు దసరా, బతుకమ్మ పండుగలకు ముస్లింలు మంచినీరు ఏర్పాటు చేస్తారని, అదే విధంగా ముస్లింల పండుగలకు హిందువులు వారికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారని.. ఇలా ఒకరికొకరు సహకారం అందించుకోవడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. వేసవి కాల దృష్ట్యా ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సిద్దిపేటలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మొదటి సారి కూలార్లు, షామియానా, మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ లతో ఈద్గా వద్ద ముస్లిం సోదరులను కలిసి ఆలయ్ బలయ్ తీసుకుంటూ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు అవలంభించే పండగ రంజాన్ అని, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకి శుభాకాంక్షలు తెలుపుతూ.. రంజాన్ పండుగ పవిత్రతకు, త్యాగానికి చిహ్నమని, పండుగను భక్తి శ్రద్దలతో, ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నదని తెలిపారు. సేవాదృక్పథ భక్తి ప్రవృతులు, సోదర భావాలు మత సామరస్యాన్ని చాటి చెప్పే గొప్ప పండుగ రంజాన్ అని పేర్కొన్నారు. మైనార్టీ ల అభ్యున్నతికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని వెల్ల‌డించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ అధికారి జీవ రత్నం, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.