వనపర్తి జూన్ 15 (way2newstv.com):
జేఈఈ అడ్వాన్స్డ్ లో అఖిల భారత స్థాయి నాలుగవ ర్యాంకు. దక్షిణ భారతదేశం తో పాటు తెలంగాణలో మొదటి ర్యాంకు సాధించిన జిల్లెల ఆకాష్ రెడ్డి నీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించి అభినందించారు.
ర్యాంకర్ ను సన్మానించిన మంత్రి
శనివారం హైదరాబాదులోని జిల్లెలగూడ లోని అతని నివాసానికి వెళ్లి ఆయన అభినందించారు. వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రానికి చెందిన అశోక్ రెడ్డి ఇందిరమ్మ దంపతుల కుమారుడు జిల్లెల ఆకాష్ రెడ్డి రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించడంవనపర్తి జిల్లా కు ఎంతో గర్వకారణమని ఆయన అన్నారు. అదేవిధంగా ఆకాష్ రెడ్డి ఎంతో ఎత్తు ఎదిగి రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆయన ఆకాష్ రెడ్డి ను ఆశీర్వదించారు.