ఆర్ ఆర్ బీ బ్యాంకు గ్రామీణ కొలువుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆర్ ఆర్ బీ బ్యాంకు గ్రామీణ కొలువుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం


దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు.దేశంలోని వివిధ గ్రామీణ బ్యాంకుల్లో 8400 ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టుల భర్తీకి 'ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)' నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మంగళవారం (జూన్ 18) ప్రారంభమైంది. 


ఆర్ ఆర్ బీ బ్యాంకు  గ్రామీణ కొలువుల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపట్టనున్నారు. పోస్టులు, ముఖ్యమైన తేదీలు. తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పరిధిలో అనంతపురం, చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం జిల్లా ప్రాంతాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు,