ఐదేళ్ల తర్వాత కూడా నోచుకొని కాన్వకేషన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఐదేళ్ల తర్వాత కూడా నోచుకొని కాన్వకేషన్


తిరుపతి, జూన్ 17, (way2newstv.com)
ఉన్నత విద్యారంగంలోనూ ఉన్నత స్థానంలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది. ఇటీవల ఎస్వీ యూనివర్శిటీకి నాక్‌ కమిటీచే ఏ+ గ్రేడ్‌ లభించింది. దేశంలో ఏ+ గ్రేడ్‌ వర్శిటీలను వేళ్ళ మీద లెక్కకట్టవచ్చు. అంటే వర్శిటీలో అంత ఉన్నతమైన, నాణ్యమైన విద్య, పరిశోధనలు జరుగుతున్నాయని తెలియకనే తెలియచెబుతోంది. అయితే గత ఆరు సంవత్సరాలుగా వర్సిటీలో స్నాతకోత్సవం విడుదల చేసి, దానిని ప్రతి సంవత్సరం క్రమపద్దతిగా నిర్వహించలేకపోవడం దురదృష్టకరం. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు స్నాతకోత్సవ డిగ్రీలు ఇవ్వకుండా, ఇన్‌అడ్వాన్స్‌ల పేరుతో అన్యాయం చేయొద్దు. 2011వ సంవత్సరంలో పీజీలు, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు 2015లో స్నాతకోత్సవ డిగ్రీలు ప్రదానం చేశారని, 2012వ సంవత్సరంలో విడుదల చేసిన కాన్వోకేషన్‌ నోటిఫికేషన్‌ 2018 సంవత్సరం గడిచిపోతున్నా నిర్వహించకపోవడం బాధాకరం. ఇప్పటికైనా ఎస్వీయూ ఉన్నతాధికారులు స్పందించి 2012వ సంవత్సరపు స్నాతకోత్సవాన్ని నిర్వహించాలని కోరుతున్నాం. లేనిపక్షంలో విద్యార్థుల అధ్వర్యంలో పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తాం. 2012 సంవత్సరానికి 2014లో స్నాతకోత్సవానికి దరఖాస్తుకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. కానీ సంవత్సరాలు గడుస్తున్నా స్నాతకోత్సవం జరపకపోవడంలో ఆంతర్యమేమిటని విద్యార్థులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. 


ఐదేళ్ల తర్వాత కూడా నోచుకొని కాన్వకేషన్
వర్సిటీకి ఇప్పటివరకు ముగ్గురు విసిలు మారినా స్నాతకోత్సవం మాత్రం జరుపలేకపోయారు. ఒక డిగ్రీ సర్టిఫికేట్‌ కోసం రెండు సార్లు డబ్బులు చెల్లించినా సకాలంలో డిగ్రీలు అందక చాలా మంది కొలువులు సాధించిన విద్యార్థులు తమ ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. విభాగాలను ఏర్పాటు చేయడం కాదు... ఉన్న వాటిని సరిగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని వర్సిటిలోని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. మహిళా వర్శిటీలో ప్రతి సంవత్సరం స్నాతకోత్సవం జరుగుతుంటే, ఎస్వీయూలో మాత్రం స్నాతకోత్సవం జరిగి దాదాపుగా ఆరు సంవత్సరాలు పైనే అవుతుంది. ప్రతి సంవత్సరం ఫీజులను పెంచుతూపోతే విద్యార్థులకు ఉన్నతవిద్య 'కలలా' మిగిలిపోనుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి స్నాతకోత్సవం జరపడానికి చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. లేనిపక్షంలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పరిపాలనా భవనాన్ని ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఎంతో మంది విద్యార్థులు ఉపాధి కల్పించే స్నాతకోత్తర డిగ్రీని విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకోవాలి. ఎస్వీయూలో 2012లో విడుదల చేసిన స్నాతకోత్సవం వేంటనే జరపాల్సిందే. విద్యార్థులకు సకాలంలో సర్టిఫికెట్లను అందించడం ద్వారా వారికి కొలువులలో చేరేందుకు ఎలాంటి ఆటంకాలు ఉండవు. విద్యార్థులు సమస్యలపై ఎస్వీయూ ఉన్నతాధికారుల సత్వరం స్పందించాలి ఇప్పటికైనా ఉన్నతాధికారలు చొరవ తీసుకొని వేంటనే స్నాతకోత్సవం జరపాలి, లేనిపక్షంలో వేల సంఖ్యలో విద్యార్థులతో కలిసి పరిపాలనా భవనాన్ని ముట్టడిస్తామంటున్నారు విద్యార్థి సంఘాల నేతలు.