తెలంగాణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన మహేందర్ రెడ్డి


హైదరాబాద్, జూన్ 19  (way2newstv.com)
శాసన మండలి సభ్యులు గా డాక్టర్  పట్నం మహేందర్ రెడ్డి, బుధవాంర ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్  లతో పాటు ఎంఎల్ఏ లు పట్నం నరేందర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గాంధీ,యాదయ్య, ఆనంద్, మహేష్ రెడ్డి, సుభాష్ రెడ్డి, బల్క సుమన్,  మండలి విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, లో ఎంఎల్సీలు కర్నె ప్రభాకర్,  మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి  రెడ్డి, 


తెలంగాణ ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన మహేందర్ రెడ్డి
పట్లొళ్ళ కార్తిక్ రెడ్డి, వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, తదితరులు మహేందర్ రెడ్డికి  అభినందనలు తెలిపారు. సీనియర్ నేత గా మండలి లో రాణించాలని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మూడు దశాబ్దాల మిత్రుడు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహేందర్ రెడ్డి కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా  మంత్రి మల్లారెడ్డి ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి కి బోకేలతో సన్మానించారు. అనుభవం ఉన్న నేత గా మహేందర్ రెడ్డి మండలి ఎన్నిక కావటం పార్టీ కి మరింత బలోపేతం చేయడానికి దోహదం చేస్తుందని చెప్పారు.
Previous Post Next Post