తెలంగాణలో నైరుతి పవనాలు ఎంట్రీ


హైద్రాబాద్, జూన్ 20, (way2newstv.com)
ఎండలతో మండిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో రుతుపవనాల ప్రవేశానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, 22వ తేదీన అవి తెలంగాణలోకి ప్రవేశిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గురువారం నుంచి తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. జూన్ నెల మొదటి వారంలో కేరళను తాకిన రుతుపవనాలు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయు తుఫాను కారణంగా మందకొడిగా మారాయి. 


తెలంగాణలో నైరుతి పవనాలు ఎంట్రీ
తుఫాను తేమనంతా పీల్చేసుకోవడంతో రుతుపవనాల విస్తరణకు ప్రతికూలంగా మారింది. అందుకే అంచనా వేసిన దానికంటే 10రోజులు ఆలస్యంగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వాతావరణంలో తేమశాతం పెరిగిందని, దీని ప్రభావంతో రానున్న 2-3రోజుల్లో కర్ణాటకతో పాటు ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతు పవనాలు తెలంగాణలో పశ్చిమ దిశగా 22న తెలంగాణలో ప్రవేశించి రాష్ట్రమంతా వ్యాపిస్తాయని, జులై నెలలో అల్ప పీడనాలు ఏర్పడి మరింత బలపడతాయని అధికారులు చెబుతున్నారు. వీటి కారణంగా వచ్చే నెలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు
Previous Post Next Post