రేపటి తరం సంతోషంగా ఉండాలంటే.. తప్పనిసరి మొక్కలు నాటాలని పాఠ్యాంశం తేవాలి. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రేపటి తరం సంతోషంగా ఉండాలంటే.. తప్పనిసరి మొక్కలు నాటాలని పాఠ్యాంశం తేవాలి.


సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి హరీశ్ 
సిద్ధిపేట, జూన్ 05 (way2newstv.com)
రేపటి తరం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలంటే.. ప్రతి ఒక్కరూ తప్పనిసరి మొక్కలు నాటే 
విధంగా పాఠ్యాంశం తేవాలని రాష్ట్ర మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు అందరం కలిసి సమిష్టిగా ఒక గొప్ప యుద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది.! ఈ పర్యావరణ పరిరక్షణ యుద్ధంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి..!! విస్మరిస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది..!!!  సహజ వనరుల పరిరక్షణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హరీశ్ రావు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఇక్బాల్ మినారు ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం మేధావులు, కవులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, చదువు కున్న వారు, మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజలు అంతా ఒక్కరుగా కలిసి రావాలని కోరారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో సైతం మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారని.. పలు ఉదాహరణలుగా చెప్పుకొచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనూ మొక్కలు నాటడం, వాటిని పెంచేలా చర్యలు తీసుకోవడం అలాగే కాలుష్యాన్ని నివారించేలా తగు చర్యలు చేపట్టి, ప్లాస్టిక్ నిషేదిస్తున్నారని వివరించారు. 

రేపటి తరం సంతోషంగా ఉండాలంటే.. తప్పనిసరి మొక్కలు నాటాలని పాఠ్యాంశం తేవాలి.
130 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో సైతం మనం మేల్కొని ముందుకు సాగాలని, క్యాన్సర్ లాంటి అతి ప్రమాదకర వ్యాధులు వేగంగా వస్తున్నాయని వాటి నుంచి మానవ మనుగడ ప్రశార్థకంగా మారుతుందని బాధపడటం కంటే.. కావాల్సిన చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలని, ఇందు కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, నాటిన మొక్కలను పరిరక్షించాలని కోరారు. టన్నుల కొద్దీ పెరుగుతున్న ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని, రేపటి తరం సంతోషంగా ఉండాలంటే.. పెరుగుతున్న కాలుష్యం నివారిస్తూ.. పర్యావరణ పరిరక్షణకై.. సహజ వనరులను కాపాడే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీవకోటి మనుగడ ప్రకృతి.. పర్యావరణం పై ఆధారపడి ఉందంటూ.. ప్రకృతి ని నిర్లక్ష్యం చేస్తే.. మానవ మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని., ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి చెట్లను పెంచాలని, అడవులను సంరక్షించాలని కోరారు. ఈ  భూమండలం లో అన్నింటి కంటే విలువైనది ప్రకృతి, జీవ కోటి మనుగడ ప్రకృతి, పర్యవరణం పై ఆధారపడి ఉందన్నారు. మొక్కలు లేక పోతే మానవ మనుగడనే ప్రశ్నార్ధకమవుతుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలెన్నో ప్రకృతి, సహజ వనరులపై దృష్టి పెడుతున్నాయని, ప్రతి ఒక్కరూ తమ విధిగా మొక్కలు నాటాలని, నాటిన  మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యతను తీసుకోవాలని కోరారు. అంతకు ముందు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా సిద్ధిపేట కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. సిద్ధిపేట బార్ అసోసియేషన్ సభ్యులతో మొక్క నాటించి సంరక్షించాలని, కోర్టు ప్రాంగణమంతా పచ్చదనంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వివిధ వార్డు కౌన్సిలర్లు, సిద్ధిపేట బార్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.