విద్యాస్వరూపం మార్చిన సీఎం కేసీఆర్ సర్కారు


వనపర్తి జూన్ 14  (way2newstv.com
సీఎం కేసీఆర్ సర్కారు విద్యాస్వరూపం మార్చారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి మండలం రాజపేటలో మంత్రి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి నేడు బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక, హాజరుశాతం పెరిగిందన్నారు. 


విద్యాస్వరూపం మార్చిన సీఎం కేసీఆర్ సర్కారు
ఉచిత పాఠ్యపుస్తకాలు, దుస్తుల పంపిణీ, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం, వారానికి మూడుసార్లు గుడ్లు, అర్హులైన అధ్యాపకులు, డిజిటల్ తరగతు కల్పన, కిశోర బాలికలకు ఆరోగ్యకిట్లు వంటి ఎన్నో చర్యలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. దశాబ్దాల వివక్షను సీఎం కేసీఆర్ దూరం చేశారన్నారు. తెలంగాణ గురుకులాలు దేశానికే ఆదర్శం అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చదివించాలని కోరారు. వారి ఉజ్వల భవిష్యత్‌కు తెలంగాణ ప్రభుత్వానిది హామీ అన్నారు.
Previous Post Next Post