రెండు తెలుగు రాష్ట్రాలు అన్నదమ్ముల వలె కలిసి మెలిసి ఉండాలని నిర్ణయించాం. ఈ ధోరణి చిన్న సమస్యలతో పాటు ఇరిగేషన్ సమస్యలపై సుదీర్ఘ చర్చ జరిగింది. నాటి ఉద్యమనేతగా.. ప్రజల కష్టాలు కళ్లారా చూసిన వ్యక్తిగా కేసీఆర్ కు తెలుసని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్ లో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, సీఎస్ లు, ప్రభుత్వ సలహాదారుల, ముఖ్య అధికారుల సమావేశం జరిగింది. భేటీ వివరాలు మంత్రులు మీడియాతో వివరించారు. మెట్ట ప్రాంతాలకు నీళ్లు అందించేందుకు ఇరు రాష్ట్రల జల నిపుణులు, ఇరిగేషన్ అధికారులను కోరారు.
అన్నదమ్ములలాగా
ఇరుగుపొరుగు రాష్టాలతో ఘర్షణ వాతావరణం లేకుండా ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వెళ్తున్నాం. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక లతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపింది. ఏపీ, తెలంగాణ కలిసి మెలిసి అందరికి ఆదర్శంగా ఉండాలని నిర్ణయించారు. రెండూ వ్యవసాయ రాష్టాలే. కరెంటు, నీళ్ల కష్టాలు తెలుసు. అవసరం అయితే రేపు కూడా సమావేశం కొనసాగిస్తామని ఈటల వెల్లడించారు. ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతూ రోజు చరిత్రాత్మక దినం. జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకున్నాడు. గోదావరి జలాలు, ఇతర నదీ జలాలను ఏవిధంగా కలిసి ఉపయోగించుకోవలనే దానిపై చర్చ జరిగింది. 9, 10 షెడ్యూల్ లోని సంస్థల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ సలహాదారులు కృషి చేయాలని సూచించం. దేశానికే మార్గదర్శనంగా ఉంటాం. నదీ జలాల వినియోగంపై సలహాలు, సూచనల కోసం జూలై 15 కటాఫ్ డేట్ పెట్టుకున్నాం. ఇద్దరు సీఎంలు లీడర్ల మాదిరి కాకుండా స్టేట్స్ మెన్లుగా వ్యవహరించారు. ఏ విషయంలో అయిన కలిసి నిర్ణయం తీసుకోవాలని భావించాము. ఏ కేసు ఎప్పుడు వేశారో ఆ కేసుల సమాచారం కచ్చితంగా మా దగ్గర లేదు. చంద్రబాబు నిబంధనలు అతిక్రమించి కరకట్ట మీద భవనాల నిర్మాణం చేశారు. బాబు ఇంటి పక్కన నిర్మించిన కమిటీ హాల్ కు ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేవని అన్నారు.