ఉగాది రోజు పండుగగా జరగాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉగాది రోజు పండుగగా జరగాలి

ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే

విజయవాడ జూన్ 24 (way2newstv.com)
అమరావతిలో జరుగుతోన్న కలెక్టర్ల సదస్సులో అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. మనం పాలకులం కాదని, సేవకులమనే విషయం ప్రతి క్షణం గుర్తుంచుకోవాలని సూచించారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పనిచేయాలని, నవరత్నాలు మేనిఫెస్టో ప్రతి మంత్రి, కలెక్టర్‌, అధికారి దగ్గర ఉండాలని పేర్కొన్నారు. మేనిఫెస్టో అన్నది ఓ భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలని, పై స్థాయిలో తాను నిర్ణయాలు తీసుకుంటే.. కింది స్థాయిలో అమలు చేసేది కలక్టర్లేనని తెలిపారు. అందరం కలిసి పనిచేస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయన్నారు. మేనిఫెస్టోను గొప్పగా అమలు చేస్తామని ప్రజలు నమ్మి ప్రజలు ఓట్లు వేశారని, నా ద్వారా మీకు అధికారం ఇచ్చారన్నారు.


ఉగాది రోజు పండుగగా జరగాలి
ఏపీ చరిత్రలో ఇంత భారీ మెజారిటీ ఇప్పటి వరకు ఎవ్వరికీ ఇవ్వలేదని, ప్రజలు మనల్ని నమ్మరు కాబట్టి ఈ రోజు మనం అధికారంలో ఉన్నామని అన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి అంశాన్ని అమలు చేయాలని వ్యాఖ్యానించారు. రేపటి ఎన్నికల్లో మేనిఫెస్టోను అమలు చేశామని చెప్పుకుని ఓట్లు అడగాలని, దీనికి మీ అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గ్రీవెన్స్ డే నిర్వహించి, స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని అన్నారు. సమస్య ఎన్ని రోజుల్లో పరిష్కారమవుతుందో రశీదు ఇవ్వాలని, అది పరిష్కారమైందో లేదో తెలపాలని ఆదేశించారు. రెండేళ్లలో పాఠశాలల రూపురేఖలు మారాలని, అన్ని స్కూల్స్ ఫోటోలు తనకు పంపాలని చెప్పారు. రైతులు, విద్య, వైద్యం తన ప్రాధాన్యత అంశాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని, దీని ద్వారా తాను కూడా పాలనను పరిశీలిస్తానని అన్నారు. అధికారులు అకస్మాత్తుగా వారానికి ఒకచోట బసచేయాలని, స్కూల్ లేదా హాస్పిటల్‌లో నిద్రపోవాలని సూచించారు. రాష్ట్రంలో ఇళ్లు లేనివారు ఉండరాదని, పట్టా ఇచ్చి పొజిషన్ చూపకుండా ఉండొద్దని అన్నారు. ప్రభుత్వ భూమిలేకపోతే భూమి కొనుగోలు చేయాలని, ఇందుకు నిధులు మంజూరు చేస్తామని జగన్ హామీ ఇచ్చారు.