'కంటి వెలుగు'లో పాల్గొన్న ఉద్యోగుల జీతాలను వెంటనే చెల్లించాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

'కంటి వెలుగు'లో పాల్గొన్న ఉద్యోగుల జీతాలను వెంటనే చెల్లించాలి


హైదరాబాద్, జూన్ 20, (way2newstv.com)
'కంటి వెలుగు'లో పాల్గొన్న ఉద్యోగుల జీతాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రజా ఉద్యమాల వేదిక (టీఏపీఎమ్) రాష్ట్ర కన్వీనర్,భారత సుదర్శన్, రాష్ట్ర కార్యదర్శి పుల్లూరు శ్రీనివాస్, తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేదిక రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. గురువారం ఎక్కడ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ఈ మేరకు ముఖ్య మంత్రి కెసిఆర్ కు బహిరంగ లేఖ రాసినట్లు వారు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో దఫా ఎన్నికల్లో మీరు గెలవడానికి గల ముఖ్య కారణాల్లో 'కంటి వెలుగు' పథకం ఒకటని, ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండానే హడావుడిగా ప్రారంభించిన  'కంటి వెలుగు' కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. 


'కంటి వెలుగు'లో పాల్గొన్న ఉద్యోగుల జీతాలను వెంటనే చెల్లించాలి

మన 'ఇంటి వెలుగు'ల శ్రమతో 'కంటి వెలుగు' విజయవంతం అవడంతో మీరు ఎన్నికలలో గణనీయమైన ఫలితాలు సాధించి మరోమారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.  అయినప్పటికీ 'కంటి వెలుగు' ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు చెల్లించకపోవడం దారుణమన్నారు.
 'కంటి వెలుగు' డిమాండ్స్ :
* కంటి వెలుగులో పాల్గొన్న కాంట్రాక్ట్ & రెగ్యులర్ ఉద్యోగుల జీతాలను, ఇంటెన్సివ్ లను వెంటనే చెల్లించాలి.
* మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో 'కంటి వెలుగు'లో పాల్గొన్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు మూడు నెలల జీతాలను, ఫుడ్ అలవెన్సులను వెంటనే చెల్లించాలి. 
* 'కంటి వెలుగు' కార్యక్రమంలో పాల్గొన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకొని, వారి సేవలను కొనసాగించాలి. 
* రాష్ట్ర వ్యాప్తంగా 'కంటి వెలుగు' కార్యక్రమంలోని నిధులను నొక్కేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 
* తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలోని ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. 
* తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న తెలంగాణ వారందరినీ వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.