బదిలీలల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బదిలీలల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు


నెల్లూరు, జూన్ 28, (way2newstv.com)
ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఉన్న నిషేధాన్ని ఇటీవల ఎత్తివేసిన విషయం తెలిసిందే. విద్యాశాఖ మినహాయించి మిగిలిన శాఖలకు అవకాశం కల్పించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పారదర్శికత, నిజాయతీని చెబుతున్నా ఉద్యోగులు మాత్రం వైసిపి నేతల చుట్టూ తిరుగుతున్నారు. తమకు అనుకూలమైన ప్రాంతానికి, ఆదాయం వచ్చే చోటుకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. ఈనేపథ్యంలో వైసిపిలో ఎవరి జాబితా వారు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే పోలీసులు బదిలీల్లో ఒకరిద్దరు నేతలే చక్రం తిప్పారని ఆపార్టీలో కొందరు నేతలు గుర్రుగా ఉన్నారు. సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. ఎన్నికలకు ముందు ఇక్కడకు వచ్చిన తహశీల్దారులు మళ్లీ తమ సొంత జిల్లాలకు వెళ్లడానికి పావులుకదుపుతున్నారు. ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. 

బదిలీలల కోసం నేతల చుట్టూ ప్రదక్షిణలు

నూతన ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తమకు అనుకూలమైన అధికారులను నియమించుకోడానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధమయ్యారు. ఇప్పటికే పోలీసుల బదిలీలు వేగంగా సాగుతున్నాయి. గత ప్రభుత్వం వైసిపికి వ్యతిరేకంగా పనిచేసిన కొందరు అధికారులను బదిలీ చేయించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కొందరు పోలీసు అధికారులు వైసిపి నాయకులు, ఎంఎల్‌ఎలను కలిసి సర్దుబాటు చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఒకరిద్దరు నేతలు మాత్రమే చక్రం తిప్పినట్లు సమాచారం. తమకు అనుకూలమైన పోలీసు అధికారులను ఆయా నియోజకవర్గాలకు బదిలీ చేయించుకుంటున్నారు. మరికొందరు అధికారులను విఆర్‌కు పిలవడంతోపాటు, ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించే పనిలో వైసిపి నాయకులున్నారు. ఇతర శాఖల్లోని ఉద్యోగులు బదిలీ చేయించుకునే పనిలో ఉన్నారు. ఐదేళ్లు నిండిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. ఈనేపథ్యంలో దగ్గరగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. స్థానిక ఎంఎల్‌ఎల సిఫా ర్సులు చేయించుకుంటున్నారు. కొన్ని జిల్లాస్థాయి అధికారుల బదిలీలు జరగాల్సి ఉంది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ప్రజా ప్రతినిధుల మాటకువిలువ ఇవ్వాలని, గౌరవించాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఉద్యోగుల బదిలీ అంశాల్లో ఉమ్మడి నిర్ణయాలుండేవి. మంత్రులు, ఎంఎల్‌ఎల సిఫార్సులను పార్టీ అధ్యక్షులు తీసుకొని సమన్వయంతో బదిలీలు జరిపించేవారు. ఇప్పుడు వైసిపిలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎవరికివారే యమున తీరే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఉద్యోగులు ఎవరి వద్దకు వెళితే ఏ సమస్య వస్తుం దోననే భయాందోళన చెందుతున్నారు. నేరుగా ఎంఎల్‌ఎలు, మంత్రుల వద్దకు కాకుండా చోటా, పేటా నాయకుల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. సిఫార్సులు చేయించుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు బదిలీపై వచ్చిన తహశీల్దాదారుల పరిస్థితి సందిగ్దంలో ఉంది. ఎన్నికల కోడ్‌లో భాగంగా ప్రకాశం, గుంటూరు జిల్లా నుంచి భారీ మొత్తంలో ఇక్కడకు తహశీల్దారులు బదిలీపై వచ్చారు. ఎన్నికల కోడ్‌ ముగిశాక ఇక్కడ నుంచి సొంత జిల్లాలకు బదిలీ కావాల్సి ఉంది. ఎన్నికల కోడ్‌ ముగిసినా వీరి బదిలీ మాత్రం జరగలేదు. ఒక్క తహశీల్దారు ఇక్కడ కాపురం లేరు. పిల్లల చదువుల విషయమై గతంలో ఉన్నచోటే కాపురాలుంటున్నారు. ఆరు ఏడు నెలలకు మాత్రమే కావడంతో ఎవరూ బదిలీ కాలేదు. ఇక్కడ స్థానికంగా పని చేయడానికి తహశీల్దారులు సిద్ధపడడం లేదు. తాము తాత్కాలిక అధికారుల మేనని, ఏలాంటి నిర్ణయాలు తీసు కోకుండా కొన్ని ఫైళ్లపై సంతకాలుపెట్టే పరిస్థితి కనిపించడంలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పాలన పడేకేసింది. చిన్న చిన్న సర్టిఫికెట్ల కోసం పడిగాపులు కాయాల్సి వస్తుంది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకొని తమ బదిలీల గురించి ఆలోచించాలని కోరుతున్నారు. రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేయించినా ఫలితం శూన్యం.