లక్షద్వీప్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం బలపడి ఆదివారం ఆగ్నేయ, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరింత బలపడి రానున్న రెండు రోజుల్లో వాయుగుండంగా, తర్వాత 24 గంటల్లో తుఫాన్ మారనుందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
చురుగ్గా నైరుతి రుతు పవనాలు
నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదలనున్నాయి. సోమవారంనాటికి కేరళలోని మిగిలిన ప్రాంతాలు, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని పలుప్రాంతాలు, తమిళనాడులో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే క్రమంలో కేరళ, కర్ణాటక, తమిళనాడు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Tags:
Andrapradeshnews