ధర్టీ ఇయర్ ఇండస్ట్రీకి అవకాశాలెక్కడ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ధర్టీ ఇయర్ ఇండస్ట్రీకి అవకాశాలెక్కడ


హైద్రాబాద్, జూన్ 19 (way2newstv.com)
కమెడియన్ పృధ్వీ తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే మంచి మంచి సినిమాలు చేస్తూ మంచి పేరు తెపించుకుంటున్నాడు. వరసగా కమెడియన్ అవకాశాలు దక్కించుకుంటూ సినిమాలు మీద సినిమాలు చేస్తున్న తను రీసెంట్ గా వైసిపి తరఫున ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ పై చాలానే కామెంట్లు చేసాడు. ఒకసారి అయితే గీత దాటాడు కూడా.


ధర్టీ ఇయర్ ఇండస్ట్రీకి అవకాశాలెక్కడ

టీవీ చానెల్స్ వారు ఆ వీడియో పదేపదే వేసి చూపించారు. దాంతో మనోడు మెగాఫ్యామిలీ సినిమాలు అన్నటికి దూరం అవుతున్నాడు. ఇటువంటి వాళ్ళు లౌక్యంగా ఎలాంటి నెగెటివ్‌ కామెంట్లు లేకుండా తమ పార్టీకి ప్రచారం చేసుకుంటే మంచిది. కానీ పృధ్వీ హద్దులు దాటాడు. ఇతన్ని త్రివిక్రమ్ తన సినిమా తీసేశాడట. త్రివిక్రమ్ ఎప్పుడు తన సినిమాల్లో ఇతనికి మంచి పాత్రలు ఇచ్చేవాడు. కానీ ఈసారి బన్నీ అతను మన సినిమాలో వద్దు అని చెప్పడంతో అతన్ని తీసేశారని టాక్ వస్తుంది. అలానే మిగతా మెగా హీరోల సినిమాలలోను ఇతనికి ఛాన్స్‌లు రాకపోవచ్చు. అలా మనోడు రాజకీయం మీద పిచ్చి తో ఏది పడితే అది మాట్లాడి సినిమా ఛాన్స్ లు పోగొట్టుకుంటున్నాడు.