సేంద్రియ విధానంతో కొత్త పుంతలు


ఏలూరు, జూన్ 28, (way2newstv.com)
రైతులు విక్షణారహితంగా పంటలకు పిచికారి చేస్తున్న పురుగు మందులతో భూమి నిస్సారంగా మారుతోందని ఇటీవల వ్యవసాయ శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ప్రభుత్వం పురుగు మందులు అవసరం లేని ప్రకతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా జిల్లాలోని 225 గ్రామాలను ఎంపిక చేసి రైతులతో ప్రకతి వ్యవసాయం చేయించేందుకు అధికారులు సంకల్పించారు. వ్యవసాయాధికారులు సూచనల మేరకు రైతులు కూడా ఆవు పేడ, మూత్రంతోపాటు ప్రకతి సిద్ధమైన కషాయాలతో ఎలాంటి పురుగుమందులు లేకుండా తక్కువ పెట్టుబడులతో ఆరోగ్యకరమైన పంటలను పండించొచ్చు.ఈ పరిస్థితులను అధిగమించి తక్కువ ఖర్చుతో నాణ్యమైన అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం ప్రకతి సేద్యానికి ప్రాధాన్యమిస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నది. ఖర్చు లేని ప్రకతి వ్యవసాయ విధానాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి రైతులు ఆచరించేలా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే ప్రకతి వ్యవసాయనికి శ్రీకారం చుట్టింది. 

సేంద్రియ విధానంతో కొత్త పుంతలు

జిల్లాలో 51 క్లస్టర్ల పరిధిలో 225 గ్రామాల్లో మూడు దశలుగా ప్రకతి వ్యవసాయాన్ని అమలు చేస్తున్నారు. వ్యవసాయ శాఖ, ఆత్మ ప్రాజెక్ట్‌ అధికారులు, శాస్త్రవేత్తలు ఆర్‌కెవివైవికెవివై కింద ఆయా గ్రామాల్లో రైతులకు శిక్షణ ఇచ్చి ప్రకతి సేద్యం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా వరి, చెరకు, వేరుశెనగ, కాయగూరలు, పండ్ల తోటల సాగుపై అవగాహన కల్పిస్తున్నారు.పెట్టుబడిలేని వ్యవసాయాన్ని సుభాష్‌ పాలేకర్‌ 1998లో రూపొందించారు. అంటే ఎరువులు, క్రిమిసంహారక మందుల కోసం ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. జీవామతం, బీజామతం లాంటివి మాత్రమే వినియోగిస్తారు. ఈ రసాయనాలకు దేశవాళి ఆవు కీలకం. ఒక ఆవు ద్వారా లభించే మూత్రం, పేడతో తయారు చేసే సహజ ఎరువులతో 30 ఎకరాల్లో ప్రకతి సేద్యం చేయవచ్చు. ఉదాహరణకు ఒక ఎకరాలో రసాయనిక ఎరువులు, పురుగుల మందులతో వరి పంటను సాగు చేయడానికి రూ.30 వేల వరకు ఖర్చు అవుతుండగా, ప్రకతి సేద్యంతో రూ.15 వేలు మాత్రమే ఖర్చవుతుంది. ప్రకతి సేద్యంతో 5 బస్తాల మేరకు ధాన్యం దిగుబడి పెరిగినట్లు ప్రకతి సేద్యం చేస్తున్న రైతులు చెబుతున్నారు.రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా కేవలం ప్రకతి సంబంధ పదార్థాలతో పంటలను సాగు చేయడాన్ని ప్రకతి వ్యవసాయం అంటారు. దీనికి దేశవాళి ఆవు చాలా ముఖ్యం. ఇది లేకుండా ప్రకతి వ్యవసాయం చేయడం సాధ్యం కాదు. ఒక్క ఆవుతో 30 ఎకరాల్లో ప్రకతి వ్యవసాయం చేయవచ్చు. దేశవాళి ఆవు మూత్రం, పేడ, పాలు, పుట్టమన్ను, పొడి సున్నం, బెల్లం, పప్పుల పిండి, వేప, సీతాఫలం, ఆముదం, బొప్పాయి ఆకులు, శొంఠిపొడితో పాటు నీరు అవసరం. వీటితో బీజామతం, ద్రవ జీవామతం, ఘన జీవామతం, వేప కషాయం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివి తయారు చేసుకుని నేరుగా చీడపీడల నివారణ మందుగా వినియోగించుకోవాలి.
Previous Post Next Post