ఎస్పీ అపూర్వ రావు
వనపర్తి జూన్ 10 (way2newstv.com)
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ అపూర్వ రావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఆరుగురు ఫిర్యాదుదారులు విచ్చేసి వారి ఫిర్యాదులను ఎస్ పి కి అందజేశారు.
సమస్యలను త్వరితగతిన పరిష్కరించండి
ఎస్పీ అపూర్వ రావు స్వయంగా ఫిర్యాది దారులతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకొని ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా రెరండు భార్యాభర్తల తగాదాలు.రెండు పరస్పర తగాదాలు. ఒక కేసులో ఇతర తగాదాల పై ఫిర్యాదులు రాగా వెంటనే వాటిని పరిష్కరించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Tags:
News