న్యూఢిల్లీలోని ప్రసార్ భారతి కాంట్రాక్ట్ పద్ధతిలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వారీగా ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్నవాళ్లు ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. జులై 12 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.
పోస్టులు పోస్టుల సంఖ్య
యాంకర్ కమ్ కరస్పాండెంట్ 10
కాపీ రైటర్ 08
ప్రసారభారతిలో ఉద్యోగాలు
అసైన్‌మెంట్ కోఆర్డినేటర్ 07
కరస్పాండెంట్ 16
గెస్ట్ కోఆర్డినేటర్ 04
కెమెరా పర్సన్ 15
బ్రాడ్‌కాస్ట్ ఎగ్జిక్యూటివ్ 10
పోస్ట్ ప్రొడక్షన్ అసిస్టెంట్ 19
మొత్తం ఖాళీలు 89
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్, డిప్లొమా/డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం. దరఖాస్తు విధానం: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు చేరేలా పంపాలి. ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం. చివరితేది: 12.07.2019.