అందరికీ ఆరోగ్యరక్ష (కరీంనగర్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అందరికీ ఆరోగ్యరక్ష (కరీంనగర్)

కరీంనగర్, జూన్ 5 (way2newstv.com):
బాలికల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఆరోగ్య కిట్లు (హెల్త్‌, హైజిన్‌ కిట్లు) పంపిణీ చేస్తోంది. బాలికలు నిత్యం వినియోగించే 13 రకాల వస్తువులు సరఫరా చేస్తున్నారు. బాలికల సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా నెలసారి రుతురుమాలు(న్యాప్‌కిన్‌) అందిస్తున్నారు. ప్రతి మూడు నెలలకొకసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే బాలికలకు విధిగా వీటిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య కిట్లు మండల వనరుల కేంద్రాలకు తరలించారు. పాఠశాలల్లో ప్రవేశాలు పొందిన బాలికలకు వీటిని పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్కారు, కస్తూర్బా, ఆదర్శ పాఠశాల్లో చదువుకునే బాలికలు వీటి ద్వారా పలు ప్రయోజనాలు పొందుతున్నారు.సర్కారు బడుల్లో చదువుకునే బాలికలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదరికం అడ్డురావడంతో చదువు మధ్యలో మానేస్తున్నారు. కాస్మోటిక్‌, న్యాప్‌కిన్‌, ఇతర సామగ్రి కొనుగోలు బాలికలకు తలకు మించిన భారమవుతోంది. 

అందరికీ ఆరోగ్యరక్ష (కరీంనగర్)

రెక్కాడితే డొక్కాడని కుటుంబాల పిల్లలు అవస్థలు పడుతున్నారు. బాలికల అక్షరాస్యతకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు ఆరోగ్య కిట్లను పంపిణీ చేసేందుకు విద్యాశాఖ నిధులు కేటాయిస్తోంది. బాలికల జీవితంలో వినియోగించే వస్తువులను ఉచితంగా పంపిణీ చేయాలని సంకల్పించారు. నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో గత ఏడాది నుంచి ఆరోగ్య కిట్లు అందిస్తున్నారు. మూడు నెలలకొకసారి వీటిని సరఫరా చేస్తున్నారు. బాలికల సంపూర్ణ ఆరోగ్య లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. నెలనెల వినియోగించే రుతు రుమాలు అందిస్తున్నారు. ఆరోగ్య కిట్ల పంపిణీలో నాణ్యత ప్రమాణాలు పాటించారు. నిత్య జీవితంలో వినియోగించే 13 రకాల వస్తువులు సరఫరా చేస్తున్నారు. బాత్‌ సోప్‌ 300 గ్రాములు, డిటర్జెంట్‌ సోప్‌-300 గ్రా, శాంపు సీసా-150 మి.లీ, కొబ్బరినూనె-175 మి.లీ, పౌడర్‌-50 గ్రా, టూత్‌ పేస్టు-100 గ్రా, టూత్‌ బ్రెష్‌ 1, టంగ్‌ క్లీనర్‌ 1, దువ్కెన, స్లిక్కరు 1, రిబ్బన్లు, హెయిర్‌ బ్యాండ్స్‌, న్యాప్‌కిన్‌ వస్తువులు ఉన్నాయి. ప్రతి మూడు నెలలకొకసారి వీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వసతి గృహాల్లో అభ్యసించే విద్యార్థులకు సబ్బులు, కాస్మోటిక్‌ ఛార్జీలు చెల్లిస్తున్న విద్యాశాఖ బాలికల ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు నాణ్యమైన వస్తువులు పంపిణీ చేస్తుండటంతో ప్రయోజనం చేకూరుతుంది. ఒక్కో కిట్‌కు వందల్లో ఖర్చు చేస్తున్నారు. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, ఆదర్శ, కస్తూర్బా, గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో అభ్యసించే బాలికలకు ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విడతల వారీగా ఆరోగ్య కిట్లు మండలాలకు చేరుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 49,932 కిట్లను సరఫరాచేశారు. గత ఏడాది యూడైస్‌ ఆధారంగా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నారు.