పధకాలన్నీ పార్టీ కార్యకర్తలకే


ఏలూరు, జూన్ 15 (way2newstv.com): 
ఉభయ గోదావరి జిల్లాల్లో రైస్ మిల్లర్లు ధాన్యం రైతుల నుండి బియ్యాన్ని అక్రమ కొనుగోళ్లు చేస్తూ రైతుల నుండి ఐదువందల కోట్ల వరకు అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారు.  గత ప్రభుత్వం జన్మభూమి గ్రామ కమిటీల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ టిడిపి పార్టీ కార్యకర్తలకు కు మాత్రమే సంక్షేమ పథకాలు అందించేవారు అదే మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం గ్రామ వాలంటీర్లు పేరుతో గత ప్రభుత్వం 


పధకాలన్నీ పార్టీ కార్యకర్తలకే
మాదిరిగా పథకాలన్నింటిని వారి పార్టీ కార్యకర్తలకు దోచి పెడుతుందని మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాల రావు ఆరోపించారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ పథకం లో కొత్తగా రెండు వేల వరకు వ్యాధులను గుర్తించి ఆరోగ్యశ్రీ వర్తింపజేయడం హర్షణీయం. అంతే కాకుండా వ్యాధుల తో నిమిత్తం లేకుండా నిరుపేదలు ఎవరైనా హాస్పిటల్ కి వస్తే అన్ని వ్యాధులకు ఆరోగ్యశ్రీ వర్తింప చేయాలని అయన సూచించారు. 
Previous Post Next Post