మూడు నెలల పాటు ముహర్తాలకు బ్రేక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూడు నెలల పాటు ముహర్తాలకు బ్రేక్


హైద్రాబాద్, జూన్ 28, (way2newstv.com)
చైత్ర వైశాఖ మాసాల్లో ఆషాడం నాలుగోది. ఈ నెలలో వివాహాది శుభకార్యాలను జరిపించరు. అలాగే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశంతో దక్షిణాయనం మొదలవుతుంది. ఇది కూడా ఆషాడంతోనే ప్రారంభమవుతుంది. ఈ సమయంలో నూతన గృహప్రవేశాలను కూడా నిర్వహించడానికి అంతగా సముఖత చూపారు. ఈ ఏడాది ఆషాడం జులై 2న మొదలవుతుంది. ఇది ఆగస్టు 1 వరకు ఉంటుంది. అనంతరం శ్రావణం మొదలైనా శుక్ర మూఢమి కావడంతో వివాహాలు, శుభకార్యాలకు మరో మూడు నెలల వరకూ మంచి ముహూర్తాలు లేవు. శ్రావణమాసంలో పెళ్లిళ్లకు మంచి కాలంగా భావిస్తారు. 

మూడు నెలల పాటు ముహర్తాలకు బ్రేక్

ఈ ఏడాది మాత్రం మూఢమి వల్ల శ్రావణం శూన్యమాసమైంది. మూఢమి మూడు నెలలపాటు ఉంటుంది. జులై 7 సోమవారం ఆషాఢ శు.సప్తమి రా.2.38 గంటలకు శుక్రమూఢమి ప్రారంభమై, సెప్టెంబరు 20 శుక్రవారం భాద్రపద శుద్ధ షష్ఠి ఉదయం 6.07 గంటలకు సమాప్తమవుతుంది. మరో పది రోజుల తర్వాత అంటే అక్టోబరు 2న ముహూర్తాలు మొదలవుతాయి. అంటే జూన్ 28 చిట్టచివరి శుభముహూర్తం. ఆ తర్వాత మరో మూడు మాసాలు ఎలాంటి మూహూర్తాలు లేవు. ఇక, డిసెంబరులో గురు మూఢమి వల్ల శుభకార్యాలకు వీలుపడదు. డిసెంబరు 13 శుక్రవారం మార్గశిర శుద్ధ విదియ రాత్రి 1.11గంటలకు పశ్చాదస్తమిత గురుమూఫమి ప్రారంభమై, 2020 జనవరి 10 గురువారం పుష్య శుద్ధ పౌర్ణమి రా.10.23 గంటలకు మూఢమి త్యాగం. సహజంగా ఏడాది రెండు రకాల మూఢాలు ఉంటాయి. అవి గురు మౌఢ్యమి, శుక్రమౌఢ్యమి. గురువు సూర్యునితో కలిసి ఉండే కాలాన్ని గురు మౌఢ్యమి లేదా గురుమూఢమి అని, శుక్రుడు సూర్యునితో కలిసి ఉండే కాలాన్ని శుక్రమూఢ్యమి లేదా శుక్రమూఢమి అని పిలుస్తారు. ఆ విధంగా ఆయా గ్రహాలు సూర్యునితో కలిసి ఉన్న సమయంలో అవి వక్రీంచి బలహీనంగా ఉంటాయి. ఆ విధంగా గ్రహాలు బలహీనంగా ఉన్న సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరాదని మూహూర్త నిర్ణయ గ్రంథాలు చెబుతున్నాయి.