అదిలాబాద్ జిల్లా సిరీకొండ మండలం చిమన్ గుడి గ్రామం లో ఫుడ్ పాయిజన్ కావడంతో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక రోజు ముందు విందులో వండిన ఆహారాన్ని మరుసటి రోజు తీసుకోవడం తో గ్రామస్థులు క్రమంగా 30 మంది వరకు వాంతులు, విరోచనాలు చేసుకుంటూ అస్వస్థకు లోనయ్యారు.
విషాహారం తినడంతో ముఫై మందికి అస్వస్థత
విషయం తెలుసుకున్న వైద్య అధికారులు హూట హుటిన గ్రామానికి చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించి బాధితులను రిమ్స్ కు తరలించారు. కాస్త ప్రభావితం అయినా వారికి గ్రామం లో శిబిరాన్ని ఏర్పాటు చేసి చికిత్స ప్రారంభించారు. స్థానిక వైద్య అధికారిని సంప్రదించగా ఫుడ్ పాయిజన్ గా లక్షణాలు కనిపిస్తున్నా నీటి కాలుష్యం వల్ల కూడ కావొచ్చు అని అనుమానిస్తూన్నట్లు వైద్యులు అంటున్నారు. నిర్ధారణ కోరకు ఆహారపు శాంపిల్స్,నీటి శాంపిల్స్ నిర్ధారణ కేంద్రానికి పంపినట్లు చెప్పారు.
Tags:
telangananews