మూడోసారి ప్రతిపక్షనేతగా బాబు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మూడోసారి ప్రతిపక్షనేతగా బాబు...


తండ్రికి...కొడుకు సర్కార్లలో టీడీపీ అధినేత
గుంటూరు, జూన్ 12, (way2newstv.com)
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ. ఆయన 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా కాంగ్రెస్ తరఫున నెగ్గారు. మంత్రిగా కూడా మొదటిదఫాలోనే పని చేసే చాన్స్ చిన్న వయసులోనే దక్కించుకున్నారు. అప్పట్లో అదో రికార్డ్. ఇక మామ పెట్టిన పార్టీ మీద పోటీకి దిగి మంత్రిగా ఓడిపోవడమూ ఓ సంచనలమే. మొత్తానికి 32 ఏళ్ళకే ముదురు రాజకీయ నేతగా బాబు అప్పట్లోనే పేరు తెచ్చేసుకున్నారు. తరువాత టీడీపీలో చేరి నందమూరి రాజకీయ సలహాదారుగా మారి చివరిని ఆ పార్టీని తన గుప్పిట్లోకి విజయవంతగా తెచ్చుకోవడంలోనూ బాబు మార్క్ రికార్డ్ కనిపిస్తుంది.ఇదిలా ఉండగా 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండవమారు 1999లో గెలిచి సీఎం కుర్చీ ఎక్కారు. 


మూడోసారి ప్రతిపక్షనేతగా బాబు...
మళ్ళీ ఆముచ్చట పదేళ్ళ తరువాత కానీ అంటే 2014 వరకూ దక్కలేదు. ఈ మధ్యలో రెండు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. మోడీ గాలి. బాబు అనుభవం, పవన్ చరిష్మా అన్నీ కలసి గత ఎన్నికల్లో మూడవసారి బాబుకు సీఎం కుర్చీ దక్కేలా చేశాయి. ఇలా రెండు సార్లు ఉమ్మడి ఏపీలో ఒకమారు విభజన ఆంధ్రాకు సీఎం గా పనిచేసి బాబు కొత్త రికార్డ్ నెలకొల్పారు.ఇక ప్రతిపక్షనాయకుని పాత్రలో కూడా బాబు ముచ్చటగా మూడవసారి కుదురుకోబోతున్నారు. రెండుసార్లు ఉమ్మడి ఏపీలో అపోజిషన్ లీడర్ గా ఉన్న ఆయన ఇపుడు విభజన ఏపీలో మూడోసారి లీడర్ ఆఫ్ అపోజిషన్ కాబోతున్నారు. దాంతో ముఖ్యమంత్రిగా మూడుసార్లు, ప్రతిపక్ష నేతగా మూడుసార్లు పనిచేసిన అరుదైన నేతగా బాబు కొత్త రికార్డ్ సృష్టించారన్న మాట. అంతే కాదు. ఈ విధంగా ఆయన అధికార యోగాన్ని, వియోగాన్ని బ్యాలన్స్ చేసేశారు. ఇక్కడ ఇంకో విశేషం కూడా ఉంది. బాబు రెండు సార్లు వైఎస్సార్ జమానాలో ప్రతిపక్ష నేత. ఇపుడు ఆయన కుమారుడు జగన్ సీఎం గా ఉండగా విపక్ష నేత. అంతే కాదు. వైఎస్ ని, జగన్ని ఒకసారి ఓడించిన రికార్డు ఆయనకే సొంతం.మొత్తానికి బాబు రాజకీయ జీవితంలో ఇవన్నీ అరుదైన రికార్డులే.