మరో వారంలో స్కూళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరో వారంలో స్కూళ్లు


సమస్యలతోనే పిల్లలకు స్వాగతం
అనంతపురం, జూన్ 6, (way2newstv.com)
వేసవి సెలవులు ముగియనున్నాయి ఈ నెల 12వ తేది నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు 78, జిల్లా పరిషత్‌, మండలపరిషత్‌ 2,404, రెసిడెన్షియల్‌ 1, కెజిబివి 53, మున్సిపల్‌ 141, ఇతర ఎయిడెడ్‌ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 4.50 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ నెల 12వ తేది నుంచి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోనున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. విద్యాసంవత్సరం ప్రారంభమవుతున్నప్పటికీ అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, స్కూల్‌యూనిఫామ్స్‌ సరఫరా చేయాల్సి ఉంది. పాఠ్యపుస్తకాల ముద్రణ ఇంతవరకు ప్రారంభించకపోవడంతో పాఠశాలల ప్రారంభానికి అందడం ప్రశ్నార్థకమేపాఠశాలల్లో విద్యార్థులు చేరేలోగా వారికి పాఠ్యపుస్తకాలు, స్కూల్‌ యూనిఫామ్స్‌ అందేలా చూస్తాం' ఈ మాటలు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ చేసినవి. వాస్తవానికి విద్యాశాఖ చేసిన ప్రకటనకు ప్రస్తుత పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. 


మరో వారంలో స్కూళ్లు
పాఠశాలలను పర్యవేక్షించే అధికారులు లేక పాలన గాడి తప్పింది. చాలా పాఠశాలల్లో కనీస వసతులు లేని పరిస్థితి ఉంది. ఈ విద్యాసంవత్సరం గతేడాది మాదిరిగానే విద్యార్థులకు గందరగోళంగా విద్యాబోధన అందించే అవకాశాలున్నాయి. జిల్లాలో కర్నూలు, ఆదోని, నంద్యాల, డోన్‌ ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. నంద్యాల, ఆదోనిలో ఇంచార్జ్‌ మండల విద్యాశాఖాధికారులతో నెట్టుకొస్తున్నారు. డోన్‌ ఉప విద్యాశాఖ అధికారి గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. కర్నూలుకు జిల్లా విద్యాశాఖ అధికారే బాధ్యతలను చూస్తున్నారు. జిల్లాలోని 10 మండలాలకుపైగా మండల విద్యాశాఖ అధికారి పోస్టులు ఖాళీగానే వున్నాయి. జిల్లాలో ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించి ఎస్జీటి 426, స్కూల్‌ అసిస్టెంట్‌ 92, హెచ్‌ఎంలు 35కుపైగా ఖాళీ వున్నాయి. గతేడాది నిర్వహించిన ఉపాధ్యాయుల బదిలీల్లో 104 మందికి వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ వేశారు. వీరు అయా పాఠశాలల్లో ఖాళీగా వున్న స్థానాల్లో విధులను నిర్వర్తించారు. వీరంతా గత విద్యాసంవత్సరం ముగిసిన నాటికే అయా పాఠశాలల నుంచి రిలీవ్‌ అయ్యారు. ఇప్పుడు ఈ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. అనేక ఫ్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు లేని పరిస్థితి వుంది. ప్రభుత్వ పాఠశాల్లో టాయిలెట్లు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. బాలికల విద్యను పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన కస్తూర్భా గాంధీ పాఠశాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయి. జిల్లాలో దాదాపు 50కు పైగా సిఆర్టీలు, స్పెషలాఫీసర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మోడల్‌ స్కూల్స్‌ను ప్రారంభించనప్పటికీ ఇంతవరకు హాస్టల్‌ సౌకర్యం కల్పించలేదు. విద్యార్థినుల కోసం హాస్టల్‌ వసతిని నామామాత్రంగానే ప్రారంభించారు. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వచ్చాయి. కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా ఫలితాలు వచ్చినప్పటికి వాటని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ పాఠశాలలను బలోపేతం చేసి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి మెరుగైన విద్యాబోధన అందించాలని కోరుతున్నారు.