విజయవాడ, జూన్ 3, (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు క్షణం తీరిక లేకుండా గడిపిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఇప్పుడు తీరిక దొరికింది. ఎన్నికల సమయంలో పార్టీ ప్రచారంపై దృష్టిసారించి కంటి మీద కునుకు లేకుండా శ్రమించిన చంద్రబాబు ఇప్పుడు కాసేపు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి తరవాత ఎన్టీఆర్ జయంతి వేడుకలు, పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న చంద్రబాబు..
వారం పాటు చంద్రబాబు ఫారిన్ టూర్
ఇప్పుడు వారం రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా వారం రోజులపాటు చంద్రబాబు విదేశాల్లో గడపనున్నారు. ఈనెల 7 నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన ప్రారంభమవుతుంది. ఈ నెల 14న చంద్రబాబు మళ్లీ విజయవాడకు తిరిగి వస్తారు. చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తరవాత పార్టీ బలోపేతం కోసం నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తారని తెలుస్తోంది. కాగా, చంద్రబాబు పర్యటన నిమిత్తం ఏ దేశానికి వెళ్తున్నారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. భద్రతా కారణాల దృష్ట్యా మాజీ ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్‌ను గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు తన పనులతో బిజీబిజీగా గడిపిన చంద్రబాబు ఇప్పుడు తన మనవడితో జాలీగా గపడనున్నారు.