ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ


అమరావతి, జూన్ 8 (way2newstv.com)
సచివాలయంలో బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.  సచివాలయానకి తొలిసారిగా వచచిన సీఎం కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికారు. ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి ప్రతిభావంతులైన అధికారుల సమాహారం ఉంది. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేయడానికి అధికారులంత సిద్ధంగా ఉన్నారని అన్నారు. 


ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి భేటీ
అనేక సవాళ్ళను సైతం ఎదుర్కొని మంచి పనితీరును ప్రదర్శించే ప్రతిభ ఇక్కడ అధికార యంత్రాంగానికి ఉంది, లక్ష్యాలకు అనుగుణంగా, ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసే గొప్ప సామర్థ్యం ఉన్న అధికారులున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ . ఇక్కడ వివిధ విభాగాధిపతులు, కార్యదర్శులు, సీనియర్ అధికారులు ఉన్నారు. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు. మీరు పూర్తిగా సహకరిస్తే ప్రజల,  ప్రభుత్వ కల సాకారం అవుతుందని అన్నారు. మీపై నాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వంలో అవినీతి కి ఆస్కారం లేని పారదర్శక పాలన అందించడానికి ధృఢ సంకల్పం తో ఉన్నాను. అవినీతిని నిర్ములించి ప్రభుత్వానికి నిధులు ఆదా చేయండని అన్నారు.