జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు


తాడేపల్లి జూన్ 7 (way2newstv.com)
మనం చేసే ప్రతి పనీ, ప్రతి కార్యక్రమంతో ప్రజలకు చేరువ కావాలని ఎపి ముఖ్యమంత్రి జగన్ అన్నారు. శుక్రవారం జరిగిన  వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో జగన్ మాట్లాడుతూ మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్ పెరగాలని చెప్పారు. పాలనలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. అవినీతికి తావివ్వకుండా పాలన సాగాలని ఆయన అన్నారు. అలాగే, 25 మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు అయన వెల్లడించారు.  మంత్రివర్గంలో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. 


జగన్ క్యాబినెట్ వర్గంలో ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు
అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. జగన్ మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోంది.  మనం వేసే ప్రతి అడుగు ప్రజలకు దగ్గర చేయాలి. సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలి.మనం వేసే ప్రతి అడుగు ద్వారా మన గ్రాఫ్ పెరగాలని చెప్పారు. పాలనలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. అవినీతికి తావివ్వకుండా పాలన సాగాలని ఆయన అన్నారు. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలి.  ప్రతి కాంట్రాక్ట్ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళుతుంది.  ఏడు రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో టెండర్ల ప్రక్రియ ఉంటుంది. జ్యుడీషియల్ కమిషన్ సూచనల మేరకు ప్రతి టెండర్లో మార్పులు ఉంటాయని అయన అన్నారు. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్ టెండర్ ప్రక్రియ చేడతాం. రివర్స్ టెండరింగ్ లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తాం.  చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారని అయన ఆరోపించారు.ఇప్పటివరకూ తీసుకున్న అన్ని నిర్ణయాలు ఆ దిశగానే చేస్తున్నాం. అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్ అన్నారు..