ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణ స్వీకారం..


అమరావతి జూన్ 08 (way2newstv.com)
ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే శంబంగి చిన అప్పలనాయుడు చేత గవర్నర్‌ నరసింహన్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌ హాల్లో ఉదయం 11.15 గంటలకు శంబంగి ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌తోపాటు అధికారులు పాల్గొన్నారు. మరికాసేపట్లో 25మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా గవర్నర్‌ పదవీ స్వీకార ప్రమాణం చేయించనున్నారు. 

ప్రొటెం స్పీకర్‌గా శంబంగి ప్రమాణ స్వీకారం..
Previous Post Next Post