నకిలీ విత్తనాల చలామణీపై ఉక్కుపాదం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నకిలీ విత్తనాల చలామణీపై ఉక్కుపాదం


అమరావతి, జూన్ 6, (way2newstv.com)
నకిలీ విత్తనాల చలామణిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారు. అటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని, అక్రమాలు జరిగితే జైలుకు పంపడానికి కూడా వెనుకడుగు వేయొద్దని సీఎం అధికారులకు తెలిపారు.అక్టోబర్ 2వ తేదీన ప్రారంభమయ్యే గ్రామ సచివాలయాలు వ్యవసాయ రంగం అవసరాలకు ప్రధాన కేంద్రం చేసే ఆలోచన  వుందని అయన అన్నారు. గురువారం ఉదయం అయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయం, దాని అనుబంధ అంశాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.


నకిలీ విత్తనాల చలామణీపై ఉక్కుపాదం
భేటీలో అయన మాట్లాడుతూ *రాష్ట్రంలో వినియోగించే విత్తనాలు, ఎరువులు, మందుల పంపిణీ గ్రామా సచివాలయాల ద్వారా జరిగేల చర్యలు తీసుకోవలసిందిగా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం సేవలు అందించిందీ అంటే దానికో ప్రత్యేక బ్రాండ్ పడాలి. రైతులకు ప్రభుత్వ సేవలపై విశ్వసనీయత పెంచాలని అన్నారు. ఎవరు అవినీతికి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంచి సలహాలు, సూచనలు ఇచ్చే సిబ్బందికి సన్మానం చేస్తామని సీఎం జగన్ ప్రకటించారు.  అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.  రైతలకు బీమా సౌకర్యం సక్రమంగా అందించే పూర్తి బాధ్యత ఇక ప్రభుత్వానిదే. ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. పరిష్కారాలు వంద శాతం ఉండాలని అయన అన్నారు. రైతు సంతృప్తి చెందకపోతే ఎంత చేసినా వృధానే అని  జగన్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ.12,500 ఇచ్చే రైతు భరోసా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అక్టోబర్ 15 నుండి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. రూ.3000 కోట్ల రూపాయలతో మార్కెట్ స్థిరీకరణ నిధిని బడ్జెట్ లో పెడతామని, రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ఈ నిధి ద్వార ప్రభుత్వం అండగా ఉంటుందని అయన అన్నారు.