వాల్మీకీలో వరుణ్... రాంచరణ్ మేనరిజం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వాల్మీకీలో వరుణ్... రాంచరణ్ మేనరిజం


హైద్రాబాద్, జూన్ 27 (way2newstv.com)
గత ఏడాది రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎంత హిట్ అయిందో వేరే చెప్పనసరం లేదు. ఈసినిమాతో రామ్ చరణ్ లో నటుడు బయటకు వచ్చాడు. ప్రేక్షకులు అంతలా కనెక్ట్ అవ్వడానికి కారణం చరణ్ గెటప్ పాటు చరణ్  మేకోవర్ కూడా ఒక కారణం.రంగస్థలం సినిమాలో చరణ్ గుబురు గడ్డం, కోర మీసాలతో చరణ్ కొత్తగా కనిపించి మెప్పించారు.’ఇప్పుడు అటువంటి లుక్ తోనే వరుణ్ తేజ్ కనిపిస్తున్నాడు.

వాల్మీకీలో వరుణ్... రాంచరణ్ మేనరిజం
హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొత్త సినిమా ‘వాల్మీకి’ కోసం ఈ లుక్ ట్రై చేశాడు వరుణ్. కాకపోతే ఇందులో తను కొంచం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. పాత్ర కు తగ్గట్టుగానే తన మేకోవర్ ఉంది. ఈ గెటప్ కోసం హరీష్ అండ్ వరుణ్ బాగానే కష్టపడ్డారు అని అర్ధం అవుతుంది.ఈమధ్య టాలీవుడ్ లో ఇటువంటి ట్రెండ్ ఎక్కువ అయిపోయింది. ఇటువంటి లుక్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఇక రంగస్థలం సినిమాతో వాల్మీకి ని పోలుస్తున్నారు. రంగస్థలం మాదిరిగానే ఈసినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అంటున్నారు. చూద్దాం సెప్టెంబర్ 6వ తేదీన ఈమూవీ రిలీజ్ అవుతుంది.