రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగున్నాయి


కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు  వివరించిన గవర్నర్‌ నరసింహన్
న్యూఢిల్లీ జూన్ 10 (way2newstv.com)
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్ భేటి అయినారు.మర్యాదపూర్వకంగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశానని గవర్నర్‌ పేర్కొన్నారు. అమిత్‌షాతో భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిస్థితులను అమిత్‌షాకు వివరించానన్నారు. 


రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగున్నాయి
పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా.. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామన్నారు.ప్రస్తుతం 2రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయని గవర్నర్‌ తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ భవనాలు తెలంగాణకు ఇవ్వడానికి.. ఏపీ ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఢిల్లీలోని ఉమ్మడి ఏపీ భవన్‌ అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చిందని తెలిపారు. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని గవర్నర్ పేర్కొన్నారు.
Previous Post Next Post