గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి 5 సంవత్సరం 6 నెలలు చేసిన అభివృద్ధి మాత్రమే కడప జిల్లాలో ఉందని రాష్ట్ర డిప్యూటీ సీఎం అంజాద్ బాషా అన్నారు. మంగళవారం అయన కడపలో పర్యటించారు. రాబోయే 6 నెలలో ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేసి 2 సంవత్సరాలలో పూర్తి చేస్తాం.
కడపలో సంపూర్ణ అభివృద్ధి
వైయస్ జగన్మోహన్ రెడ్డి సీయం అయిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక డిప్యూటీ సీఎం పదవి మైనార్టీలకు ఇవ్వడం హర్షణీయమని అన్నారు. ముస్లిం మైనారిటీ అందరూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నాం. వైయస్ జగన్మోహన్ ఇచ్చిన హామీలతో కడపను సంపూర్ణ అభివృద్ధి చేస్తానని అయన అన్నారు.
Tags:
Andrapradeshnews