ప్రకాశం బ్యారేజీకి పట్టి సీమ నీళ్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రకాశం బ్యారేజీకి పట్టి సీమ నీళ్లు


గుంటూరు, జూన్ 19, (way2newstv.com)
మరో రెండు రోజుల్లో ప్రకాశం బ్యారేజికి పట్టిసీమ నీళ్ళు వస్తాయి అనే సంతోషంతో ఉంటే, అక్కడ రోజు రోజుకి పేరుకుపోతున్న గుర్రపుడెక్క సమస్యగా మారింది. దీంతో, జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పొక్లెయిన్ల సహాయంతో తొలగింపు కార్యక్రమం చేపట్టారు. రెండు రోజుల నుంచి  పనులు జరిగే ప్రాంతాన్ని కలెక్టర్ బీ లక్ష్మీకాంతం, మంత్రి దేవినేని ఉమా, సందర్శించి తొలగింపు కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. గుర్రపుడెక్క కృష్ణానదిలో విస్తరించి ఉన్న విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నందున రెండు, మూడు రోజుల్లో మొత్తం ప్రాంతం అంతా క్లియర్ చేసి పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని ఆదేశించారు.. 500 మంది మత్స్యకార నిపుణులను గుర్రపుడెక్కను తొలగింపునకై అదనంగా వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. సుమారు రెండు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నదిని మూడింతలు ఆక్రమించుకుంది. 


 ప్రకాశం బ్యారేజీకి పట్టి సీమ నీళ్లు
గత మూడు రోజులుగా అధికారులు తొలగింపు చర్యలు చేపట్టినా గాని ఈ జాఢ్యం వదలడం లేదు. ఇప్పటివరకు 40 వేల చదరపు మీటర్ల గుర్రపుడెక్కను తొలగించామని అధికారులు చెబుతున్నారు. ప్రతి నిత్యం నది ఎగువ భాగాన్నుండి ఈ ఆకు తెట్టలు తెట్టలుగా వచ్చి చేరుతూనే ఉంది. పట్టిసీమ నీరు రాక మొదలైతే, తూర్పు, పశ్చిమ డెల్టాలకు సాగునీరు వదిలే సమయంలో, సాగునీరుతో పాటు ఈ ఆకు కూడా నీటి ప్రవాహానికి కొట్టుకెళితే రైతులపై పెనుభారం పడుతుంది. ఏరువాక కోసం ఎదురు చూస్తున్న రైతులు ఈ గుర్రపు డెక్క ఆకుతో పాటు నీరు వస్తే దానిని తొలగించుకోవడానికి అదనపు వ్యయభారం అవుతుంది. పైగా పంట కాలువల నీటి ప్రవాహానికి అడ్డుగా మారుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, దీని పై సమీక్ష జరిపారు.  రియల్ టైం గవర్నెన్స్ కేంద్రం నుండి డ్రోన్ కెమేరాలతో గుర్రపు డెక్కను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా పరీవాహక ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పంట కాలువల పూడికలు తీసుకొని రైతులు ఏరువాక కోసం ఎదురుచూస్తున్నారని, సాగునీటి విడుదల నాటికి ఈ ఆకును పూర్తిస్థాయిలో తొలగించి సాగునీటికి అవరోధాలు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో దాదాపు 500 మందిని, ఈ పనుల్లో పెట్టారు. పడవల సాయంతో కెఇ మెయిన్ రెగ్యులేటరు వద్దకు ఆకును పోగు చేయించి అనంతరం పొక్లెయిన్ల సాయంతో తొలగిస్తున్నారు.