సర్కారీ స్కూళ్లే ముద్దు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సర్కారీ స్కూళ్లే ముద్దు...


గ్రామాల్లో వెల్లివిరిస్తున్న చైతన్యం 
ఒంగోలు, జూన్ 26, (way2newstv.com)
ప్రభుత్వ పాఠశాలే ముద్దు అరటున్నారు తురకపల్లి గ్రామస్తులు. గ్రామం నుంచి ఒకరు కూడా ప్రయివేటు పాఠశాలలకు వెళ్ళకుండా ఉండాలని గ్రామస్తులు కుట్టుబడి ఉన్నారు. స్వచ్ఛందంగా మరో వాలంటరీని కూడా ఆ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్నారు. కనీస సౌకర్యాల కల్పన పాఠశాలకు అవసరమైన వసతులు కూడా ప్రభుత్వం మీద ఆధారపడకుండా గ్రామస్తులే సేకరిస్తున్నారు. ఇది మండలంలోని మారుమూల గ్రామమైన తురకపల్లి గ్రామస్తుల కట్టుబాటు. తురకపల్లిలోని ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో మొత్తం 51 మంది విద్యార్థులున్నారు. గతంలో ఈ గ్రామం నుండి 16 మంది ప్రైవేటు పాఠశాలలకు వెళ్ళేవారు. ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన ఫలితాలు ఉపాధ్యాయుల కృషి గమనించిన గ్రామస్తులు తమ పిల్లలందరిని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించారు. ఈ విద్యా సంవత్సరం 6, 7 తరగతులలో 14 మందితో పాటు ప్రాథమిక పాఠశాలలో 60 మంది పిల్లలు చేరారు. ప్రధానోపాధ్యాయులు నరసింహారెడ్డి గ్రామస్తులందరిని ఐక్యం చేసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 


సర్కారీ స్కూళ్లే ముద్దు...
ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు గ్రామస్తులు కూడా హాజరై పాఠశాలలో సౌకర్యాలు కల్పించేందుకు హామీలిచ్చారు. ఈ విధంగా గ్రామస్తుల ఆర్థిక సహాయ సహకారంతో పాటు పాఠశాల వాతావరణాన్ని ఉపాధ్యాయుల కృషిని గమనించిన కనిగిరి, పామూరు నుంచి కూడా దాతలు ఈ పాఠశాలకు స్వచ్ఛందంగా విరాళాలు అందజేశారు. గతం నుండి ఈ పాఠశాలకు గ్రామస్తుల సహకారం ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పించాని మరికొంత మంది ముందుకు వచ్చారు. మధ్యాహ్న భోజనానికి, తాగడానికి అవసరమైన శుద్ధి చేసిన నీటిని  కాంచన వెంకట కొండారెడ్డి ఇచ్చేందుకు హామీ ఇచ్చారు. డిజిటల్‌ తరగతులకు అవసరమైన రూ.50 వేలు విలువ చేసే సామాగ్రిని అదే గ్రామానికి చెందిన గోడా మాలకొండయ్య అందజేశారు. పామూరుకు చెందిన సిమెంటు కొట్టు యజమాని కొండారెడ్డి వాటర్‌కూలింగ్‌ బాక్సును అందజేశారు. స్థానికంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు నరసింహారెడ్డి, ప్రసాద్‌, టి.వాణి, సుకన్యలు విద్యార్థులకు అవసరమైన బూట్లు, బెల్ట్‌లు, టై, ఐడికార్డులు అందజేస్తున్నారు. ఉపాధ్యాయుల కొరత తీర్చేందుకు గ్రామస్తులు స్వచ్ఛందంగా అదే గ్రామానికి చెందిన వారిని వాలంటరీగా నియమించుకుని నెలకు రూ.3 వేలు వంతున ఏప్రిల్‌ వరకు వేతనం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కనిగిరి చెందిన వ్యాపారవేత్త అభ్యుదయవాదైన తాళ్లూరి రమణయ్య నీటి అవసరమైన బోరును ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. ఈ విధంగా దాతలు ముందుకు రావడం పాఠశాలలో గురుకుల విద్యాలయాన్ని తలపించే విధంగా పాఠశాల ఉంది. తెలుగు, ఇంగ్లీష్‌ రెండు మీడియాలలో కూడా ఇక్కడ విద్య బోధిస్తున్నారు.