నీరుగారుతున్న ఉపాధిహామీ పథకం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నీరుగారుతున్న ఉపాధిహామీ పథకం


అనంతపురం, జూన్ 26, (way2newstv.com)
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నీరుగారుతోంది. ఉపాధిహామీతో గ్రామాల్లో వలసలను అడ్డుకోవాలనే లక్ష్యంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిని ప్రారంభించింది. ప్రారంభంలో బాగా పనులు జరిగినా రానురాను పథకం కుంటుపడుతోంది. అధికారుల నిర్వహణ లోపం వల్ల ఫలితంగా కూలీలకు పనులు లేక, బిల్లులు అందక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల పేరుతో పథకాన్ని నీరుగార్చే చర్యలను అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు చేస్తున్నారు.ఉపాధి పనుల్లో అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది. మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి పనులు చేసినప్పటికీ నెలలు గడిచినా కూలి లభించకపోవడంతో ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని చాలా చోట్ల పనులు చేసినప్పటికీ డబ్బులు చెల్లించడం లేదు. 


నీరుగారుతున్న ఉపాధిహామీ పథకం

ఉపాధి డబ్బులు పడలేదని ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను అడిగితే సరైన సమాధానం ఇవ్వకుండా పైఅధికారులను అడగండని నిర్లక్ష సమాధానం వస్తోంది. పనులు చేసినా లాభం లేకుండా పోతోందని కూలీలు వాపోతున్నారు. మండలంలో నెలలు గడిచిన ఉపాధి కూలీలకు ఇంతవరకు బిల్లులు మంజూరు కాలేదు. నిబంధనల ప్రకారం వారానికొసారి బిల్లులు అందజేయాల్సుంది. ఉపాధిహామీ పనులు చేస్తున్నప్పటికీ ఆరు నెలలైన ఇంతవరకు ఉపాధి కూలీల వేతనాల పంపిణీ చేయలేదు. దీంతో చాలామంది ఇతర పనులకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.డిసెంబర్‌ నెల నుంచి ఉపాధిహామీ కూలీలు డబ్బులు రాలేదు. కేవలం రెండు వారాలకు సంబంధించిన కూలీ డబ్బులు మాత్రమే వచ్చాయి. బ్యాంకు దగ్గరకు, ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం. కూలి డబ్బులు మాత్రం రావడం లేదు. కూలి డబ్బుల కోసం ఇంకా ఎన్ని రోజులు తిరగాలి. ఎక్కడ జాప్యం జరుగుతుందో మాకు తెలియజేయాలని కూలీలు కోరుతున్నారు.