చంద్రబాబులో పోరాట పటిమ సన్నగిల్లిందా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

చంద్రబాబులో పోరాట పటిమ సన్నగిల్లిందా


విజయవాడ, జూన్ 24, (way2newstv.com)
సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న నేత టిడిపి కి అధినేత గా వున్నారు. ఇందిర గాంధీ సృష్టించిన సంక్షోభం నుంచి ఎన్టీఆర్ ను కాపాడింది తానె అని ఆయన చెప్పుకుంటారు. అలాగే ఎన్టీఆర్ ను సంక్షోభం లోకి నెట్టి అధికారాన్ని ఆయన కు దూరం చేసి అది ప్రజాస్వామ్య పోరాటం అని ప్రజల మద్దత్తు కూడా సాధించిన సత్తా ఆయనది. రాజకీయ చాణుక్యుడుగా తెలుగు ప్రజల్లో పేరొందిన చంద్రబాబు నాయుడు తాజా గా ఏర్పడ్డ సంక్షోభం విషయంలో మాత్రం చేష్టలుడిగి చుడాలిసి వస్తుంది. ఒక పక్క విదేశీ పర్యటనలో ఉండటం ఒక కారణమైనా నేతలకు క్యాడర్ కి దీనిపై పోరాటానికి దిశా నిర్దేశం చేయలేకపోవడం గమనిస్తే ఆయనలో గతంలో వున్న పోరాట పటిమ సన్నగిల్లిందా అనే అనుమానాలు పార్టీ వర్గాల్లో కలుగుతున్నాయి.ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు చేసిన రాజకీయ పోరాటాలు గత చరిత్రగానే మిగిలిపోనున్నాయి. 


చంద్రబాబులో పోరాట పటిమ సన్నగిల్లిందా
నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాకా పసుపుదళపతి ఆయనపై ఏ అంశంలోనూ పోరాడి విజయం సాధించలేకపోయారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పై చంద్రబాబు నాయుడు చేసిన పోరాటాన్ని కేంద్రం పరిగణలోనికి తీసుకోలేదు. ఆ తరువాత మోడీని దేశంలో ప్రజలు తిరస్కరిస్తున్నారని ఆయన ఓటమే తన లక్ష్యమని కాంగ్రెస్ తో జట్టుకట్టి విపక్షాలను ఏకం చేసి ప్రచార యుద్ధం చేశారు చంద్రబాబు. అందులోను ఆయన వైఫల్యం చెందారు. మోడీ అఖండ మెజారిటీ తో తిరిగి అధికారం దక్కించుకున్నారు. ఇక ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఈవీఎం లు వద్దు బ్యాలెట్ ముద్దు అంటూ పోలింగ్ ముగిసేవారు అలుపెరగని పోరాటం హస్తిన కేంద్రంగా చేపట్టారు. ఒక పక్క ఎన్నికల కమిషన్ తో మరోపక్క సుప్రీం కోర్ట్ లో ఆయన సాగించిన పోరాటం ఫలితం ఇవ్వలేదు. ఇలా ఏడాదిన్నర కాలంగా బాబు రూపొందించిన అన్ని వ్యూహాలు, పోరాటాలు ఫెయిల్ కావడం ఇప్పుడు చర్చనీయం అయ్యింది.నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం పార్టీ లోకి వెళ్లిపోవడంపై టిడిపి శ్రేణులు పెద్దగా గళం విప్పలేని పరిస్థితి స్వయం కృత అపరాధల వల్ల ఏర్పడింది. వైసిపి కి చెందిన 23 మంది ఎమ్యెల్యేలు, ముగ్గురు ఎంపీ లను తమ పార్టీలో గతంలో చేర్చుకోవడంతో ఇప్పుడు ఎలాంటి పోరాటం టిడిపి చేపట్టినా హాస్యాస్పదంగానే ప్రజలు చూసే అవకాశం వుంది. అందువల్లే రాజ్య సభ ఛైర్మెన్ వెంకయ్య నాయుడు ను కలిసి తమ పార్టీ వారిని ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హులను చేయాలని ఫిర్యాదు ఇచ్చి గమ్మున ఉండటం తప్ప కోర్ట్ కి వెళతామని కూడా టిడిపి అనలేక పోతుంది. వెళ్ళినా కాలయాపన తప్ప ఫలితం ఉండదన్న అంచనాతో తెలుగుదేశం నాయకులు,చంద్రబాబు నాయుడు ఏమి చేస్తాం ఖండించడం తప్ప అంటున్నారంటేనే వారెంత డిఫెన్స్ లో పడ్డారో తేలిపోతుందంటున్నారు విశ్లేషకులు