ఎదురుదాడికి టీడీపీ రెడీ అవుతోందా... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఎదురుదాడికి టీడీపీ రెడీ అవుతోందా...


విజయవాడ, జూన్ 29, (way2newstv.com)
రాజకీయాల్లో తలదించుకుని కూర్చునివుంటే ప్రత్యర్ధులు తొక్కుకుంటూ పోతారు. ఒక పక్క ఇంటా బయటా వైసిపి రచ్చ రచ్చ చేస్తుంటే, మరో పక్క బిజెపి రోజుకో రకమైన వ్యూహాలతో టిడిపిని బలహీనపరుస్తూ సాగుతుంది. కొత్త ప్రభుత్వం అత్యధిక మెజారిటీ తో రావడంతో ఆరునెలలు సైలెన్స్ పాటించాలని భావించిన చంద్రబాబు నాయుడు తన ఆలోచన పూర్తిగా విరమించుకున్నారు. వచ్చే ఆరునెలల వరకు నిజంగా మౌనం వహిస్తే పార్టీ ని ప్రత్యర్ధులు ఉంచుతారో లేదో అన్నంతగా ఎన్నికలు ముగిసిన వెంటనే పాలిటిక్స్ మొదలు అయిపోయాయి అని గుర్తించారు చంద్రబాబు నాయుడు. దీనికి ప్రత్యామ్నాయ వ్యూహాలు రూపొందించేందుకు సిద్ధమయ్యారు టిడిపి అధినేత.వైసిపి సర్కార్ తన హయాంలో జరిగిన పనులన్నింటిపై తవ్వకాలు మొదలు పెట్టింది. కీలకమైన కాంట్రాక్ట్ లు ఇతర వ్యవహారాలపై అవకతవకలపై త్వరలో టిడిపి మంత్రులు నేతలపై కేసులు మొదలు కానున్నట్లు ప్రమాద ఘంటికలు మ్రోగుతున్నాయి. 

ఎదురుదాడికి టీడీపీ రెడీ అవుతోందా...

ఈ నేపథ్యంలో తక్షణం అప్రమత్తం కాకపోతే రాబోయే రోజుల్లో వివిధ కేసుల్లో నేతలంతా కోర్ట్ లు చుట్టూ తిరిగే అవకాశాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అనేక పనులకు ఎలాంటి టెండర్ లు సైతం లేకుండానే నామినేషన్ల పై మంత్రులు ఎమ్యెల్యేలు తమ వారికి కట్టబెట్టారు. దీనికి మచ్చుతునక ప్రజావేదిక నిర్మాణం కనిపిస్తుంది. ఈ నిర్మాణానికి నాటి మంత్రి నారాయణ నోటిమాటతో కోట్ల రూపాయల పని చేయించేశారు. ఇలా అనేక పనుల్లో యథేచ్ఛగా టిడిపి నిబంధనలకు నీళ్ళు వదిలేసింది. ఈ లోపలన్నిటిపై ఇప్పటికే విచారణకు జగన్ సర్కార్ కమిటీని ఏర్పాటు చేసి చర్యలకు సిద్ధం అయింది. ఇదిలా ఉంటే కొత్త సర్కార్ కొలువైన నాటినుంచి మాజీ మంత్రులంతా మౌన వ్రతంలోనే వున్నారు. టిడిపి మౌత్ గన్స్ తమ ఫైరింగ్ నిలిపివేయడం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తుంది.ఈ విచారణలో నాటి టిడిపి మంత్రుల నిర్వాకం బయటపెడితే ఎలా ఎదుర్కోవాలి అన్నది ఒక రిహార్సల్ పార్టీ పరంగా అవసరం. తన మంత్రులకు అవగాహనా అధ్యయనం ప్రతీ అంశంలో లేకపోతే వీరంతా చిక్కులు ఎదుర్కోక తప్పదు. ఈ నేపథ్యంలో రాబోయే ముప్పును చంద్రబాబు నాయుడు ముందే గుర్తించారు. దాంతో తన సర్కార్ లో మంత్రులుగా వున్నవారందరితో భేటీ అయ్యి అనుసరించాలిసిన భవిష్యత్తు వ్యూహాన్ని బాబు సిద్ధం చేస్తున్నారు. ఎలాంటి ఆరోపణలు ఎదురైనా ఘాటుగా కౌంటర్ లు ఇవ్వకపోతే గతంలో చేసిన పనులన్నీ అక్రమాలే అన్నది నిర్ధారితం చేసిన వారం అవుతామని దీనివల్ల వ్యక్తిగతంగా మంత్రులకు పార్టీ కి చిక్కులు ఎదురౌతాయని చంద్రబాబు నాయుడు దిశా నిర్ధేశం చేస్తూ అటాకింగ్ మోడ్ లోనే వుండాలని సూచించనున్నారు. ఈ తాజా వ్యూహం వైసిపి సర్కార్ చర్యలనుంచి ఎంతవరకు టిడిపిని కాపాడుతుందో చూడాలి.