ఇక నుంచి ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఇక నుంచి ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ


అమరావతి జూన్ 11  (way2newstv.com
ఇక నుంచి ఏపీలో రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాలకి వెళ్లాల్సిన పనిలేదు.. నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం మీ ఇంటికే డోర్ డెలివరీ చేయబోతోంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా రిక్రూట్ చేసుకోనున్న గ్రామ వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించనున్నారు. సెప్టెంబర్ 5 నుంచి ఈ కార్యక్రమం పట్టాలెక్కనుంది. బియ్యాన్ని అత్యంత నాణ్యతతో కూడిన ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేయనున్నారు. 


ఇక నుంచి ఏపీలో రేషన్ బియ్యం డోర్ డెలివరీ
5, 10, 15 కిలోల బియ్యం సంచులను సెప్టెంబర్ 1 నుంచి నేరుగా ఇంటికే డోర్ డెలివరీ చేస్తారు.బియ్యం, కందిపప్పు, పంచదారతోపాటు మరో రెండు లేదా మూడు నిత్యావసర సరుకులను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయాలని ఈ రోజు ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు.