ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వారికి కఠిన శిక్ష పడాలి

ఏపిఐఐసి ఛైర్ పర్సన్  రోజా
అమరావతి జూన్24 (way2newstv.com
ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఏపిఐఐసి చైర్ పర్సన్  రోజా కోరారు. పది రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలని అన్నారు. 
ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వారికి కఠిన శిక్ష పడాలి

వైఎస్ జగన్ ప్రభుత్వం అంటే ఆడపిల్లలకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వమని, ఇప్పటికే హోమ్ మంత్రి సుచరిత స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారని చెప్పారు. ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన ఆ వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నానని రోజా తన వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.  
Previous Post Next Post