కింగ్‌ఫిషర్‌ బీర్‌ను అందుబాటులు ఉంచండి


లేదా జగిత్యాల జిల్లాను కరీంనగర్ లో కలపండి
జగిత్యాల జూన్ 4 (way2newstv.com)
;జగిత్యాల జిల్లా వాసులకు కష్టం వచ్చిందట.. ఎండాకాలం దాని తీవ్రత మరింత పెరిగి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తోందట.. ఈ కష్టం తీరాలంటే అసలు జిల్లానే తీసుకుపోయి కరీంనగర్‌లో విలీనం చేయాలంటూ ఓఓటరు తన ఆవేదనను వ్యక్తం చేసారు. ఈ మేరకు దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పూనుకోవాలంటూ  ఒక వినతిపత్రాన్ని రాసి.. అది ముఖ్యమంత్రికి చేరాలని దేవుడికి దణ్ణం పెట్టుకొని పరిషత్‌ ఎన్నికల బ్యాలెట్‌ బాక్స్‌లో వేశాడు.


కింగ్‌ఫిషర్‌ బీర్‌ను అందుబాటులు ఉంచండి 
ఓట్ల లెక్కింపు సందర్బంగా మంగళవారం బ్యాలెట్‌ బాక్సులను ఓపెన్‌ చేసిన అధికారులు ఆ లేఖ చదివి అవాక్కయ్యారు..  ఇంతకీ వారికి వచ్చిన అంత పెద్ద కష్టం ఏమిటో తెలుసా..? గొంతు తడుపుకోవడానికి గుక్కెడు కేఎఫ్‌ బీరు దొరకడంలేదట..!జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం మూటపల్లి గ్రామానికి చెందిన బ్యాలెట్‌ బాక్స్‌ను తెరిచిన అధికారులకు జగిత్యాల జిల్లా వాసుల పేరుతో ఓలేఖ దొరికింది. తమ జిల్లాలో కింగ్‌ఫిషర్‌ బ్రాండ్‌ బీరు దొరకడం లేదని దీనిలో ఓ వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ బ్రాండ్‌ కోసం పక్క జిల్లాలకు వెళ్లాల్సి వస్తోందని కష్టాన్ని ఏకరవు పెట్టాడు. తమ మీద దయతలిచి కింగ్‌ఫిషర్‌ బీర్‌ను అందుబాటులో ఉంచాలని కోరాడు.
Previous Post Next Post