కోమటిరెడ్డిపై మండిపడ్డ వీహెచ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోమటిరెడ్డిపై మండిపడ్డ వీహెచ్


హైదరాబాద్, జూన్ 17 (way2newstv.com)
ఎంతోమంది పార్టీ జెండాలు మోసిన వారు ఉన్నా.. కోమటిరెడ్డి కుటుంబానికి కాంగ్రెస్ ఎన్నోపదవులు ఇచ్చింది. ఎమ్మెల్సీ పదవీకాలం ఇంకా మూడు యేండ్లు ఉన్న ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందని కాంగ్రెస్ నేత వి హనుమంతరావు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా బీజేపీకి మద్దతుగా వ్యాఖ్యాలు చేసిన కొమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిపై మండిపడ్డారు.  నీ అన్నకు ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇంకో అన్నకు జెడ్పిటిసీ, భార్యకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చింది. 


 కోమటిరెడ్డిపై మండిపడ్డ వీహెచ్
వారు ఓడిపోయారు. గెలిస్తే తన గొప్పతనం ఓడితే నాయకత్వ లోపం అనడం సరికాదు. అధికారం ఉన్నపార్టీలో చేరడం కాంట్రాక్టులు తెచ్చుకోవడం అవకాశ వాదం. ఇలాంటి వారి వల్ల పార్టీకి నష్టం. అవకాశవాదులు లాభం కోసం పోతారు. మీకు పార్టీ ఏం తక్కువ చేసింది. గెలిస్తే తమ గొప్పతనం ఓడితే ఉత్తమ్ జానారెడ్డి ఓడించారని చెప్పుకుంటున్నారు. మీకు ప్రజలకు సేవ చేసే ఉద్దేశ్యం లేదు. బెదిరించి పదవులు తీసుకోవడం కాంట్రాక్టుల కోసం అధికార పార్టీలోకి వెళ్లడం అలవాటు అయింది. రాహుల్ చుట్టూ ఉన్న వారు తప్పుడు సలహాలు ఇస్తున్నారు. రాహుల్ నువ్వే ముందుకు వచ్చి పార్టీని నడిపించాలని అన్నారు. రాష్ట్రాల ఇంఛార్జీలు తప్పుడు సమాచారం ఇచ్చారు. అలాంటి వారిని దూరం పెట్టాలి. నాకు కూడా అన్యాయం జరిగింది. ప్రచార కమిటీ చైర్మన్ ఇస్తా అని ఇవ్వలేదు. ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు. ఒకే కుటుంబంలో రెండు మాటలు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీలో ఉంటాడో లేదో కాలం నిర్ణయిస్తుందని అన్నారు.