రాష్ట్రంలో సమస్యలను దారి మళ్లించడానికి కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్ ను తెర మీదికి తీసుకువస్తున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డివిమర్శించారు. సోమవారం గాంధీ భవన్ లోమీడియా సమావేశం లో మాట్లాడుతూరాష్ట్రము లో లక్ష ఉద్యోగాలకు పైగా ఖాళీగా ఉన్నాయి అని కేసీఆర్ చెప్పారు.కానీ ఇప్పటి వరకు 20వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసారు. సమత బ్లాక్ , డి బ్లాక్,హెచ్ బ్లాక్ 100 ఏండ్లు ఉండేలా అప్పుడు సెక్రటేరియట్ ను నిర్మించారని చెప్పారు.కేసీఆర్ తన హయం లో కట్టినట్టు ఉండాలని ఇవన్నీ చేస్తున్నాడని దుయ్యబట్టారు.
రాష్ట్రంలో సమస్యలను దారి మళ్లించడానికి తెరపైకి కొత్త అసెంబ్లీ,సెక్రటేరియట్
సెక్రటేరియట్ కూల్చడాన్ని వ్యతిరేకిస్తూ నేను కోర్ట్ లో పిటిషన్ వేశాను ..దానికి అప్పుడు కోర్ట్ లో అడ్వకేట్ జనరల్ కూల్చడం లేదని అప్పుడు కోర్ట్ కు చెప్పారు.. ఇప్పుడు మళ్లీ ప్రారంభిస్తే కోర్ట్ ను దిక్కరించడమే. అసెంబ్లీ ని ఎందుకు తరలించాలని చూస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి ఉద్యోగాల భర్తీ కోసం విద్యార్ధులు ఎదురు చూస్తున్నారు. టిఆర్టి సెలెక్ట్ అయిన వారిపై కేసీఆర్ అసహనం గా మాట్లాడారు.వారు ఈ రాష్ట్ర ప్రజలు కాదా అని ప్రశ్నించారు. ఎర్రమంజిల్ లో అసెంబ్లీ లో కడితే ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరుగుతుంది. అక్కడ అసెంబ్లీ కట్టాలని అనుకుంటే ఎర్రమంజిల్ నుండి కూకట్ పల్లి వరకు ఫ్లై ఓవర్ వేయాల్సి ఉంటుందన్నారు. కేసీఆర్ రాచరికపు రాజు లాగా ఆలోచన చేస్తున్నాడన్నారు.నువ్వు రాజువు కాదని ప్రజల చేత ఎన్నుకోబడిన నేతవు.రాష్ట్రo ఎదుర్కొంటున్న సమస్యలు చాలా ఉన్నాయి వాటిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు.