ప్రస్తుతానికి బిజెపిలో ఉన్న దగ్గుబాటి పురందేశ్వరి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నిస్తున్నారా? జరుగుతున్న పరిణామాలు అలానే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడ కేంద్ర మంతి పదవి అనుభవించిన పురందేశ్వరి ఆ తర్వాత బిజెపికిలో వెళ్లారు. అక్కడ బిజెపి మహిళామోర్చా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పనిచేయలేకపోవడం, నియోజకవర్గాలు మార్చినా వరుసగా రెండు సార్లు ఓడిపోవడంతో బిజెపిని వీడేందుకు ఆమె చాలా కాలంగా యోచిస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ ప్రకాశం జిల్లా పర్చూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
భర్త బాటలోనే భార్య..వైసిపి లోకి పురందేశ్వరి..?
బిజెపిలో భవిష్యత్తు కనిపించకపోవడంతో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఆమె చూస్తున్నారు. భర్త ఒక పార్టీలో తాను వేరొక పార్టీలో ఉండటం కూడా మంచిది కాదని అందువల్లే ఇద్దరం ఓడిపోయామని ఆమె ఆలోచిస్తున్నారు.దగ్గుబాటి వెంకటేశ్వరరావు కొద్ది కాలం బిజెపిలో పని చేసినందున ఆయన మళ్లీ ఆ పార్టీలోకి రావడానికి ఇబ్బంది ఉంటుందని భావించి ఆమె వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మంత్రి మోపిదేవి వెంకట రమణ ద్వారా ఇప్పటికే జగన్ వద్దకు ఆమె రాయబారం పంపినట్లు కూడా చెబుతున్నారు. అయితే జగన్ వద్ద నుంచి అంత సానుకూలమైన స్పందన రాలేదని తెలిసింది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తర్వాత చూద్దాం అని జగన్ కట్ చేయడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. పార్టీలు మారడం అలవాటైపోయిన దగ్గుబాటి కుటుంబానికి ఎక్కడా కుదురు దొరకడం లేదు పాపం.