అర్ధం కాని ఆర్టీసీ బస్సులు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అర్ధం కాని ఆర్టీసీ బస్సులు..


హైద్రాబాద్, జూన్ 18, (way2newstv.com)
గరంలో తిరుగుతున్న బస్సులకు సగానికి పైగా ఇండి కేటర్ లైట్లు లేక పోవడంతో వాటి వెనక వచ్చే వాహన దారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో వారు ప్రమాదాల బారిన పడమే కాకుండా తమ వివలువైన ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. వెనుక వచ్చే వాహన దారులకు బస్సు ఎటువైపు వెళుతుందో తెలియ చేసే సిగ్నల్ లైట్లు సరిగా పని చేయక పోవడం ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహన దారులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. బస్సులు రైట్ టర్న్, లెఫ్ట్ టర్న్, యుటర్న్‌లు తీసుకునే సమయంలో చౌరస్తాల వద్ద వీటి ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. ఇంతటి ప్రాధ్యాత కలిగిన వీటిని పట్టించుకోక పోవడం, వాటిలో బల్పులను ఏర్పాటు చేయక పోవడం, ఒక వేళ అవి పగిలినట్లయితే వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.నగరంలో తిరుగుతున్న బస్సుల్లో సగానికి పైగా బస్సులు సిగ్నల్ లైట్లు లేకుండా రోడ్లపై తిరుగుతున్నాయి.అరకొర సిగ్నల్ లైట్లు ఉన్నా బస్సుల్లో అవి వెలగని పరిస్థిలున్నాయి. బస్సు డిపోలలో సైతం సిగ్నల్ లైట్స్ కొరత ఉందని, బస్సులకు లైట్లు వేద్దామన్నా వేయలేని పరిస్థితులున్నాయని అధికారులు వాపోతున్నారు. 


అర్ధం కాని ఆర్టీసీ బస్సులు..
బస్సులలో రెడ్ సిగ్నల్ లైట్స్ ఉండాల్సిన ప్రాంతంలో రేకులు పెట్టి మూసి వేస్తున్నారు. సిగ్నల్ లైట్లు వెలగక పోవడంతో బస్సులు వెనుకాల ప్రయాణించే వాహన దారులు జంకతున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పడు బస్సులు ఎటు వెళ్తున్నాయి ఆర్థం కాక ప్రయాణిలకు అయోమయానికి గురవుతూ ప్రమాదాల బారిన పడుతున్నాఆర్టీసీ అధికారులు పట్టించు కోవడం లేదనే ఆరోపణలు వెల్లవెత్తుతున్నాయి.ప్రతి రోజు ఆర్టీసీ మూడు వేలకు పైగా బస్సులు నగర రోడ్లపై తిరుగుతున్నాయి. వాటిలో 60 శాతం బస్సులకు డిజిటల్ బోర్డులు,సిగ్నల్ లైట్లు ,బస్సు రూట్ నెంబర్ వద్ద వుండే ట్యూబ్‌లైట్స్ వెలగక ప్రయాణికులు అయోమయానికి గురి అవుతున్నారు. అదీ రాత్రి సమయంలో అయితే వారి సమస్యలు చెప్పనలవి కాదు. ఏసీ బస్సులు మినహా, మెట్రో, ఎక్స్‌ప్రెస్, ఆర్డనరీ, బస్సులకు డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలనే ఆలోచన అధికారుల్లో కనిపించడం లేదని విమర్శలు వస్తున్నాయి.బస్సులు బస్సు స్టాప్ చేరే వ రకు ఆ బస్సు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతంకు వెళుతుందో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ప్రయాణికులు ఆక్యుపెన్సీ రేషియో పెంచేందుకు రద్దీ రూట్లపై దృష్టి సారించిన అధికారులు బస్సులు పని తీరు మాత్రం పట్టించు కోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. బస్సుల ఫిట్‌నెస్ విషయంలో నిర్లక్షంగా వ్యవహరిస్తుండటంతో అవి నగర రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతూ ప్రయాణికులతో పాటు ఇతర వాహన దారులకు చుక్కులు చూపిస్తున్నాయి. అవి నడి రోడ్డుపై ఆగి పోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గుతోంది. గ్రేటర్ రోడ్లపై ప్రతి రోజూ మూడు వేలకు పై బస్సులు 9 లక్షల కిలోమీటర్ల మేర తిరుగుతున్నా ప్రయాణికులు సమస్యలు మాత్రం తీరడం లేదు. బస్సుల పని తీరు సరిగా లేక పోవడంతో రోజు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య కూడా తగ్గిపోతుందని రికార్డులు చెబుతున్నాయి.. ఆర్టీసీ బస్సులకు ముందు వెనుక బాగంలో బస్సు ఏ రూటులో ప్రయాణిస్తుందో ప్రయాణికులకు తెలిపే విధంగా రూట్ నెంబర్‌తో పాటు అది ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుందో తెలిపే డిజిటల్ బోర్డులు ఉండాలి, కాని అవి ఎక్కడా కనిపించడం లేదు.ట్యూబ్‌లైట్ వెలుగులో బస్సు నెంబర్లు సరిగా కనిపించక ప్రయాణికులు వచ్చిన బస్సుల్లో వెళ్ళలేక పోతున్నారు. నగరంలో తిరిగే ప్రతి బస్సు బస్ స్టాప్‌లో నిలపాలనే నిబందనలున్నా అవి ఎక్కడా అమలు కావడం లేదు. పరిగెత్తితే కాని బస్సు ఎక్కలేని పరిస్థితులు నగరంలో సర్వ సాధారమైనాయి. ప్రయాణికులు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సాయంత్రం ఆరు అయ్యిందంటే బస్సులలో నెంబర్ బోర్డులు కనిపించక ప్రయాణికులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. బస్సులు సమీపంలోకి వచ్చిన తర్వాత బస్సు ఎక్కడకు వెళ్తుందని అడిగే లోపు బస్సులు వెళ్ళి పోతున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.ఇకనైనా అధికారులు ఇటువంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రయాణికులు కోరుకుంటున్నారు.