కోళ్లకు భారీగా డిమాండ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోళ్లకు భారీగా డిమాండ్


హైద్రాబాద్, జూన్ 11, (way2newstv.com)
మృగశిర కార్తెలో చేపలతో పాటు మాంసాహారాన్ని తినాలన్న సంప్రదాయం ఉంది. దీంతో చేపలతోపాటు నాటుకోడి కొనుగోళ్లు పెరిగాయి.చేపలు ఇష్టపడని వాళ్లు నాటుకోళ్లను కొనుగోలు చేస్తుండడంతో వాటికి డిమాండ్ పెరిగింది.సాధారణంగా మాంసాహార ప్రియులకు అత్యంత ఇష్టంగా తినే వంటకం నాటు కోడి చికెన్‌‌. మాంసం రుచుల్లో నాటు కోడి రుచే వేరు. ఈ మధ్య నగరంలో నాటు కోళ్ళకు మంచి డిమాండ్ పెరుగుతోంది. సాధారణ మాంసంతో పోలిస్తే నాటుకోడిలో కొలెస్ట్రాల్‌‌ శాతం చాలా తక్కువ. అంతేగాకుండా దీని మాంసంలో 18 రకాల అమైనో ఆసిడ్స్‌‌, విటమిన్లు బి1, బి2, బి3, బి12, కాల్షియం, ఫాస్ఫరస్‌‌, ఐరన్‌‌ నికోటినిక్‌‌ ఆసిడ్స్‌‌తో మరెన్నో ఔషధ గుణాలున్నాయి. 


కోళ్లకు భారీగా డిమాండ్

ఈ మధ్య కాలంలో నగర వాసుల్లో మాంసాహార ప్రియులలో ఆరోగ్యంపై స్పృహ పెరిగిపోవడంతో సాధారణ మాంసం, ఫార్మ్ కోళ్ళకు బదులు నాటుకోళ్ల మాంసాన్ని ఎక్కువ ఇష్టపడుతున్నారు. మృగశిర ఆరంభం కావడంతో జనాలు మాంసాహారం ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో చేపలతో పాటు నాటు కోళ్లకు కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో పాటు మటన్ రేటు కూడా చాలా పెరిగిపోవడం, కుటుంబంలో కొందరు చేపలు ఇష్టపడకపోవడం కూడా నాటుకోడికి డిమాండ్ పెరిగేందుకు కారణమవుతుంది.నగరంలోని ఎర్రగడ్డ ఆదివారం మార్కెట్, జేఎన్టీయూ దగ్గర ఉన్న మాంసం మార్కెట్, రాంనగర్, తదితర మార్కెట్లలో వ్యాపారులు నాటుకోళ్ళు అమ్మకానికి ఉంచుతారు. జేఎన్టీయూ వద్ద నేరుగా నాటుకోడి మాంసాన్ని కాచి(మంటపై కాల్చి) కట్ చేసి ఇస్తారు. కాల్చి వండుకునే మాంసం మరింత రుచిగా ఉంటుంది. ప్రస్తుతం నగరంలో 2 కేజీల నాటుకోడి ధర మార్కెట్ ను బట్టి రూ.650 నుండి రూ.800వరకు ఉంది.