రైతుబంధు పెట్టుబడి సాయం కింద ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు మొత్తం 21.22 లక్షల మంది రైతుల ఖాతాలలో రూ.2233.16 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. నాలుగు విడతల్లో ఈ సొమ్మును జమ చేసినట్లు పేర్కొన్నారు. రైతుబంధు అకౌంట్ నంబర్ మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు.
రైతు బంధుకు రెండు వేల కోట్ల జమ
ఖరీఫ్ సాగు మొదలైనందున రైతులకు పంట పెట్టుబడులకు ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన వారి ఖాతాలలో డబ్బులు జమ చేయాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల కోడ్ మూలంగా జరిగిన జాప్యంతో రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం సహకారసంఘాలు, మహిళాసంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.4837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించినట్లు తెలిపారు. మిగతా రూ.1080 కోట్లు బకాయిలు ఉన్నాయని మంత్రి ప్రకటనలో వెల్లడించారు. అందులోనూ రూ.501 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రైతులు ధాన్యం డబ్బుల విషయంలో, రైతుబంధు డబ్బుల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Tags:
Andrapradeshnews